దారుణం.. కన్నతల్లిని చంపి పూడ్చిపెట్టిన కొడుకు

కన్నతల్లిని హత్యచేసి పూడ్చిపెట్టిండు ఓ కసాయి కొడుకు. పైగా తన తల్లి కనబడటం లేదంటూ  పోలీసులుకు కంప్లైంట్ ఇచ్చిండు. పోలీసులు రంగంలోకి దిగి అసలు విషయం బయటపెట్టడంతో   జైల్లో ఊచలు లెక్కిస్తుండు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది.

సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన ఇట్ట బోయిన బాలవ్వ(80) గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో మంచానికి పరిమితమైంది.  కన్నతల్లి బాలవ్వకు సేవ చేయలేక, పోషించలేక కన్న కొడుకు చిన్న బాలయ్య  ఏప్రిల్ 13వ తేదీన   తన తల్లి గొంతు నులిమి చంపేసి ఎవరికి అనుమానం రాకుండా  శవాన్ని పూడ్చిపెట్టిండు. మరుసటి రోజు తన తల్లి కనిపించడం లేదని స్థానిక సదాశివనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిండు. చిన్న బాలయ్య ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఏప్రిల్ 17న  మండల కేంద్రంలోని బాలాజీ రైస్ మిల్ వెనుక భాగంలో బాలవ్వను  పూడ్చిపెట్టిన స్థలాన్ని  గుర్తించారు.  చిన్న బాలయ్యను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు  సదాశివనగర్ పోలీసులు.