గడువు ముగిసిన పదార్థాలతో ఐస్క్రీమ్ల తయారీ.. తిన్నారంటే ఆస్పత్రి బెడ్ ఎక్కాల్సిందే..!

మీకు బాగా ఐస్ క్రీమ్ లు తినే అలవాటు ఉందా..? అయితే జాగ్రత్త.. ! గడువు ముగిసిన పదార్థాలతో తయారు చేసిన కుల్ఫీ, ఫలుడా వంటి ఐస్ క్రీమ్ లను ఎంతో ఇష్టంగా తిన్నారంటే అంతే సంగతి..! హెల్త్ బాగోలేక ఆస్పత్రి బెడ్ ఎక్కాల్సిందే..! ఇది సూచన మాత్రమే. హెచ్చరిక మాత్రం కాదండోయ్.. చాలాచోట్ల కల్తీ వస్తువులు, నాణ్యత లేని పదార్థాలతో ఐస్ క్రీమ్ లు తయారు చేస్తున్న ఘటనలు చూస్తునే ఉన్నాం. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్ ఉప్పల్ లో బయటపడింది.

ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలుకనగర్ ప్రాంతంలో గడువు ముగిసిన పదార్థాలతో కుల్ఫీ, ఫలుడా వంటి ఐస్ క్రీమ్ లు తయారు చేస్తున్న గోదాంపై SOT పోలీసులు  దాడులు నిర్వహించారు. పోలీసుల విచారణలో కళ్లు బైర్లు కమ్మే విషయాలు తెలిశాయి. ఈ కేసులో సుశీల్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గడువు ముగిసిన పదార్థాలతో తయారు చేసిన కుల్ఫీ, ఫలుడా ఐస్ క్రీములను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఉప్పల్ పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు.