పొట్టి క్రికెట్ లో మరో లీగ్ కు రంగం సిద్ధమైంది. ప్రేక్షకులు ఎంతోకాలంగా వేచి చూస్తున్న సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ (SA20) నేటినుంచి ప్రారంభం కానుంది. టోర్నీ ప్రారంభ సీజన్ లో మొత్తం 6 జట్లు పాల్గొంటాయి. ఈ 6 జట్ల యాజమానులు ఐపీఎల్ ఫ్రాంచైజీలు కావడం విశేషం. ఈ లీగ్ లో హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, లక్నో, రాజస్థాన్, చెన్నై జట్లు ఉండబోతున్నాయి. అందుకే దీన్ని మినీ ఐపీఎల్ అని పిలుస్తున్నారు.
సౌతాఫ్రికా టీ20 లీగ్ లో డర్బన్ సూపర్ జెయింట్స్(లక్నో), జోహెన్ బర్గ్ సూపర్ కింగ్స్ (చెన్నై), ఎంఐ కేప్ టౌన్ (ముంబై), పార్ల్ రాయల్స్ (రాజస్థాన్), ప్రిటోరియా క్యాపిటల్స్ (ఢిల్లీ), సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ (హైదరాబాద్) జట్లు పాల్గొంటున్నాయి. డర్బన్ సూపర్ జెయింట్స్ కేప్టెన్ గా క్వింటన్ డికాక్, జోహెన్ బర్గ్ సూపర్ కింగ్స్ కి డుప్లెసిస్, ఎంఐ కేప్ టౌన్ కి రషిద్ ఖాన్, పార్ల్ రాయల్స్ కి డెవిడ్ మిల్లర్, ప్రిటోరియా క్యాపిటల్స్ కి వేన్ పార్నెల్, సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ కి కేప్టెన్ గా మాక్రమ్ ఉండనున్నారు. మొదటి మ్యాచ్ ఎంఐ కేప్ టౌన్, పార్ల్ రాయల్స్ మధ్య రాత్రి 9 గంటలకు నుంచి జరగనుందిజ. ఈ టోర్నీలో మొత్తం 33 మ్యాచ్ లు జరగుతాయి