
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్అధికారంలో ఉండగా అసెంబ్లీలో మొదటి సస్పెన్షన్ జరిగింది. 2023న డిసెంబర్ 9వ తేదీన రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం జరిగింది. ఆ తరువాత ఇప్పుడు జరుగుతున్న సెషన్స్‌తో కలిపి ఐదుసార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. మొదటిసారి ఓటాన్ అకౌంట్బడ్జెట్.. రెండోసారి పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాల్లోనే బీఆర్ఎస్సభ్యులు.. సభను సజావుగా జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అధికార పక్ష సభ్యులు మాట్లాడే సమయంలో అడుగడుగునా అడ్డు తగలడమే కాకుండా.. స్పీకర్‌ను డిక్టెట్ చేసేలా మాట్లాడటంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
ఈ విషయమై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే చర్చ రాగా..తాము అధికారంలో ఉండగా ప్రతిపక్షాలకు తగినంత అవకాశం కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అంత ఈజీగా సస్పెన్షన్లు, సభ్యత్వ రద్దులు చేసేలా ప్రతిపాదనలు ఉండవని తెలిపారు. అయితే, ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల్లోని తొలిరోజే గవర్నర్ ప్రసంగం సందర్భంగా కూడా బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు, రన్నింగ్కామెంట్రీ చేశారు. గురువారం ధన్యవాద తీర్మానం చర్చ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విషయంలో ఏకవచనంతో మాట్లాడటమే కాకుండా.. చైర్‌ను ప్రశ్నించడం, అవమానించేలా మాట్లాడారు. దాంతో జగదీశ్ రెడ్డిని ఈ సెషన్‌కు సస్పెండ్‌చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.