- తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల జేఏసీ
బషీర్ బాగ్, వెలుగు : ఫోన్ ట్యాపింగ్ బాధ్యులపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రాష్ట్ర న్యాయవాదుల జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్‌రెడ్డికి, డీజీపీకి ఫిర్యాదు చేశామని జేఏసీ నాయకులు చెప్పారు. బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్లో శుక్రవారం
జేఏసీ కన్వీనర్ బత్తుల కృష్ణ మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ చేయడం వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం కిందకు వస్తుందన్నారు. ఈ అంశంపై ప్రశ్నించిన మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.