తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరగానే పరిపాలన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి సచివాలయానికి వెళ్లారు. సీఎం హోదాలో తొలిసారి సచివాలయానికి వెళ్లారు. సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా వెళ్లారు. సచివాలయానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులకు సీఎస్ శాంతికుమారి ఘన స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు రేవంత్. అక్కడి నుంచి సెక్రటేరియట్ లోని 6వ ఫ్లోర్ కు రేవంత్ రెడ్డి వెళ్లారు. రేవంత్ కు వేద పండితులు ఆశీర్వాదం అందించారు.
మరికాసేపట్లో సెక్రటేరియెట్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుంది. మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలకు చట్టబద్దత కల్పించే చాన్స్ ఉందంటున్నారు.