- ఈసీజీ రిపోర్టులో గుండె సమస్య ఉంటే గ్యాస్ట్రిక్ ఇష్యూ అంటూ ట్రీట్మెంట్
- హార్ట్ ఎటాక్ తో పేషెంట్ మృతి
- పరిహారమివ్వాలంటూ ప్రైవేట్ హాస్పిటల్కు రాష్ట్ర వినియోగదారుల కమిషన్ తీర్పు
హైదరాబాద్ సిటీ, వెలుగు: నిర్లక్ష్యంగా ట్రీట్మెంట్చేసి పేషెంట్ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన ఓ దవాఖాన మేనేజ్మెంట్కు రాష్ట్ర వినియోగదారుల కమిషన్రూ.30 లక్షలు ఫైన్వేసింది. శేరిలింగంపల్లికి చెందిన మధుసూదన్ వెన్నునొప్పి, కడుపు నొప్పితో బాధపడుతూ 2016 ఆగస్టు 26న మియాపూర్ మదీనగూడలోని ప్రణామ్ హాస్పిటల్ లో అడ్మిట్అయ్యాడు. అక్కడి డాక్టర్ ఈసీజీ తీశాడు. అందులో గుండె సంబంధిత సమస్య ఉందని తెలిసినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంతో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నాడని ట్రీట్ మెంట్ చేశాడు.
కొద్ది గంటల్లోనే గుండెపోటుతో మధుసూదన్ కుప్పకూలాడు. దీంతో మెరుగైన వైద్యం కోసం సైబరాబాద్ సిటిజెన్ హాస్పిటల్ కు తరలించగా, అప్పటికే హార్ట్ఎటాక్తో చనిపోయాడని అక్కడి డాక్టర్లు నిర్ధారించారు. ఈసీజీలో గుండె సంబంధిత సమస్య ఉన్నప్పటికీ ప్రణామ్హాస్పిటల్డాక్టర్ కేవలం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కి మాత్రమే ట్రీట్ మెంట్ చేయడంతో మధుసూదన్చనిపోయాడని సిటిజెన్హాస్పిటల్డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు. బాధిత కుటుంబం ప్రణామ్ హాస్పిటల్ యాజమాన్యాన్ని పరిహారం కోరగా నిరాకరించారు. తర్వాత రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ను సంప్రదించగా బాధిత కుటుంబానికి రూ.30 లక్షలు, మానసిక వేదనకు గురిచేసినందుకు రూ.25వేలు పరిహారంగా చెల్లించాలని మేనేజ్మెంట్ను ఆదేశిస్తూ కమిషన్ అడిషనల్ బెంచ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ మెంబర్ గంగారావు, మెంబర్ రాజశ్రీ తాజాగా తీర్పునిచ్చారు.