నోటీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డులో డాక్టర్ల వివరాలు.. వార్డుల్లో కంప్లైంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు

నోటీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డులో డాక్టర్ల వివరాలు.. వార్డుల్లో కంప్లైంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు
  • ఎంజీఎంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం
  •     మంత్రులు, కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సడెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సేవలపై ఆరా
  •     అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చర్యలు
  •     ఓపీ చీటీల కౌంటర్లు పెంచేందుకు నిర్ణయం
  •     వయోవృద్ధుల కోసం స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పేషెంట్ అటెండెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం విశ్రాంతి గది
  •     ప్రతి 10 రోజులకోసారి ఆఫీసర్లతో మంత్రుల రివ్యూలకు నిర్ణయం

వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : ఉత్తర తెలంగాణకు పెద్దదిక్కుగా ఉన్న వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంజీఎం హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మెరుగైన వైద్య సేవలు అందించడంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టింది. దీంతో హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భారీ సంస్కరణలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా అత్యాధునిక వైద్య పరికరాలు ఏర్పాటు చేయడంతో పాటు పేషెంట్లకు ఫ్రీగా మందులు ఇవ్వడం, డ్యూటీలో ఉండే డాక్టర్ల పేర్లు, వివరాలు అందుబాటులో ఉంచడం, ఓపీ చీటీలు ఇచ్చే కౌంటర్లు పెంచడం వంటి చర్యలు చేపట్టారు. వీటితో పాటు హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చే పేషెంట్ల ఇబ్బందులు, సమస్యలు డైరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెప్పుకునేలా అడుగడుగునా ఫిర్యాదుల బాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఏర్పాటు చేశారు. 

మంత్రులు, కలెక్టర్ల ఆకస్మిక తనిఖీలు, ఎప్పటికప్పుడు రివ్యూలు

రాష్ట్రంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంజీఎం హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనితీరుపై సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి స్వయంగా దృష్టి పెట్టారు. హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేరుకుపోయిన సమస్యలు, డాక్టర్లు, సిబ్బంది కొరత, కావాల్సిన పరికరాలు, అభివృద్ధికి అవసరమైన నిధులు.. ఇలా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్యటనకు వచ్చిన టైంలో సెంట్రల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆవరణలో నిర్మిస్తున్న సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పెషాలిటీ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనులను పరిశీలించడంతో పాటు ఎంజీఎం హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమస్యలపై రివ్యూ నిర్వహించారు. 

తర్వాత మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, కలెక్టర్​ సత్యశారద వేర్వేరుగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. డ్యూటీలకు డుమ్మా కొట్టే డాక్టర్లు, సిబ్బందిని గుర్తించి కొందరికి షోకాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నోటీసులు జారీ చేయగా, మరికొందరిని సస్పెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలంటూ సంబంధిత ఆఫీసర్లకు లెటర్లు రాశారు. మరో వైపు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ఎప్పటికప్పుడు మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహిస్తుండగా, జిల్లా ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్యటనకు వచ్చిన ప్రతీసారి ఎంజీఎంపై రివ్యూ చేయకుండా తిరిగి వెళ్లడం లేదు.

అన్ని మందులు అందుబాటులో ఉంచాలని మంత్రి పొంగులేటి ఆదేశాలు..

జిల్లా ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి మంగళవారం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎంజీఎంలో రూ.41 లక్షలతో ఏర్పాటు చేసిన సింగిల్ల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డోనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌంటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెషీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించారు. ఈ టైంలో తమకు సరిపడా మందులు ఇవ్వడం లేదని పేషెంట్ల బంధువులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సీడీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 568 రకాల మందులకుగానూ 521 రకాలు మాత్రమే ఉన్నాయని ఆఫీసర్లు చెప్పడంతో పొంగులేటి అసహనం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. ఎంజీఎంలో పేషెంట్ల నుంచి ఫిర్యాదులు స్వీకరించి ప్రతి పది రోజులకు ఒకసారి రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలని చెప్పారు. 

ఓపీ చీటీ కౌంటర్లు పెంచుతున్రు.. 

డ్యూటీ డాక్టర్లు ఎవరో చెప్తున్రు

వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సత్య శారద బుధవారం మరోసారి ఎంజీఎంలో తనిఖీ నిర్వహించారు. రోజురోజుకు ఓపీ సంఖ్య పెరుగుతుండడంతో చీటీలు ఇచ్చే కౌంటర్లను పెంచాలని ఆదేశించారు. ఇందు కోసం ఎంజీఎంలోని వయోవృద్ధుల వార్డును కాకతీయ మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేజీ ఆవరణలోని సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పెషాలిటీ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించాలని నిర్ణయించారు. ఎంజీఎంలో ఖాళీ కానున్న వయోవృద్ధుల వార్డులో ఓపీ విభాగాన్ని ఏర్పాటు చేసి కౌంటర్ల సంఖ్య పెంచుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఓపీ వార్డును పేషెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అటెండెంట్ల విశ్రాంతి గదిగా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఎంజీఎంలో ఏఏ విభాగాల్లో ఏ డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందుబాటులోఉంటారో తెలిపేలా డాక్టర్ల పేర్లు, సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మీడియాకు విడుదల చేస్తున్నారు. డ్యూటీ డాక్టర్ల వివరాలు తెలిపే పేపర్లను నోటీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డుల్లో అతికించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాత్రమే ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేలా 20 ఫిర్యాదు బాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు

పేషెంట్లు, వారి వెంట వచ్చే బంధువులు ఎదుర్కొనే సమస్యలను డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెప్పుకునేలా ఎంజీఎం హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫిర్యాదు బాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఏర్పాటు చేశారు. హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మొత్తం 32 వార్డులు ఉండగా ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేషెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎమర్జెన్సీ ఓపీ, జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడిసిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్జరీ, పిల్లల వార్డు, ఆర్థోపెడిక్, ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రే, ఆపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ థియేటర్లు, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంవో, సూపరిండెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, నర్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి 20 ప్రాంతాల్లో 20 ఫిర్యాదు బాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను పెట్టారు. ఈ బాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాత్రమే ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయనున్నారు.