అశ్వారావుపేట, వెలుగు : అశ్వారావుపేట మండల కేంద్రంలో డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. దానికి సంబంధించిన జీఓను సీఎం కేసీఆర్గురువారం హైదరాబాద్లో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుకు అందజేశారు.
మండలంలోని డిగ్రీ స్టూడెంట్లు ఇప్పటివరకు సత్తుపల్లి వెళ్లి చదువుకుంటున్నారు. కొత్తగా మంజూరైన డిగ్రీ కాలేజీతో స్థానిక స్టూడెంట్లకు ఎంతో మేలు జరగనుంది.