గర్ల్స్ హాస్టల్ లో సీక్రెట్ కెమెరాపై ఉద్రిక్తత.. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‎లోని కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గ పరిధిలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ వాష్ రూమ్‎లో సెక్రెట్ సీసీ కెమెరా ఇష్యూ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. గర్ల్స్ హాస్టల్ వాష్ రూమ్‎లో రసహ్యంగా కెమెరా ఏర్పాటు చేసి పర్సనల్ వీడియోలు చిత్రీకరించారని ఆరోపిస్తూ విద్యార్థినులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడం స్టేట్ పాలిటిక్స్‎ను షేక్ చేస్తోంది. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఇష్యూ రాష్ట్రంలో సంచలనంగా మారడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు.. కాలేజీలో హిడెన్ సీక్రెట్ కెమెరా ఇష్యూపై వెంటనే విచారణకు ఆదేశించారు. మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్, ఎస్పీలను వెంటనే ఘటన స్థలానికి వెళ్లానని ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆర్డర్‎తో మంత్రి, కలెక్టర్, ఎస్పీ ఘటన స్థలానికి హుటాహుటిన బయలుదేరారు.

Also Read :- ఇంజినీరింగ్ లేడీస్ హాస్టల్ లో సీక్రెట్ కెమెరా

 ఇదిలా ఉంటే, మరోవైపు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గర్ల్స్ హాస్టల్ దగ్గర విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. గర్ల్స్ వాష్ రూమ్‎లో సీక్రెట్ కెమెరాలు పెట్టినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. కొందరు విద్యార్థి సంఘ నేతలు హాస్టల్‎లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, విద్యార్థి సంఘ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. విద్యార్థి సంఘాలు, విద్యార్థుల ఆందోళనతో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ వద్ద హైటెన్షన్ నెలకొంది.