కోల్‌బెల్ట్, వెలుగు : కార్మికుల కష్టార్జితంతో సింగరేణి సంస్థకు వస్తున్న ఫండ్స్‌ను రాష్ట్ర సర్కార్అక్రమంగా తరలించుకుపోతోందని, దీంతో సంస్థ దివాళా తీస్తోందని ఏఐటీయూసీ జనరల్సెక్రటరీ వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. సోమవారం రామకృష్ణాపూర్‌లోని ఏఐటీయూసీ ఆఫీస్‌లో యూనియన్12వ మహాసభలు నిర్వహించగా సీపీఐ జాతీయ సమితి సభ్యుడు కలవేని శంకర్‌తో కలిసి సీతారామయ్య చీఫ్ గెస్ట్‌గా హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని, సింగరేణిని కాపాడుకునేందుకు కార్మికవర్గం సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. ఈనెల 25, 26, 27 తేదీల్లో గోదావరిఖనిలో జరిగే యూనియన్రాష్ట్ర మహాసభను సక్సెస్ చేయాలని కోరారు.
సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగి ప్రజాప్రతినిధులు, గుర్తింపు సంఘం లీడర్లు పెత్తనం చేస్తున్నారని ఆరోపించారు. టీబీజీకేఎస్ లీడర్లు కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా పైరవీలకే పరిమితమయ్యారని మండిపడ్డారు. అంతకు ముందు లీడర్లు, కార్యకర్తలు కార్మికవాడల్లో బైక్‌ర్యాలీ నిర్వహించారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా ప్రెసిడెంట్ ఎండీ అక్బర్అలీ, సీపీఐ జిల్లా సెక్రటరీ రామడుగు లక్ష్మణ్, టౌన్ సెక్రటరీ మిట్టపెల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఏఐటీయూసీ యూనియన్ రామకృష్ణాపూర్ బ్రాంచి నూతన కమిటీని ఈ సందర్భంగా ఎన్నుకున్నారు. వైస్‌ప్రెసిడెంట్ గా ఇప్పకాయల లింగయ్య, బ్రాంచి సెక్రటరీగా ఎం.ఆంజనేయులు, అసిస్టెంట్ సెక్రటరీగా సురమల్ల వినయ్‌కుమార్, ట్రెజరర్ గా జి.పుష్పరాజు, మైనింగ్‌స్టాఫ్ ఇన్చార్జ్గా వంగ రాజేశ్వర్‌రావును ఎన్నుకున్నారు.