గవర్నర్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటమేంటి?

గవర్నర్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటమేంటి?

హైదరాబాద్: రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ ప్రెస్ మీట్లు పెట్టి నిందించటం ఏంటని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. సోమవారం చెన్నైలో గవర్నర్ తమిళి సై మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ తో గ్యాప్ నిజమేనని తెలిపారు. ఈ విషయంపై స్పందించిన మంత్రి తలసాని శ్రీనివాస్... గవర్నర్ తమిళి సై పై విమర్శలు చేశారు. తమిళి సై పొలిటికల్ లీడర్ లా మాట్లాడటం మంచిది కాదని చెప్పారు. ముఖ్యమంత్రితో పనిచేయటం ఇష్టం లేదని చెప్పడం కరెక్ట్ కాదన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం పై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రాజ్యాంగం పరంగా తన బాధ్యత నిర్వర్తించాలని హితవు పలికారు. వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు లాంటి వారే రాజ్యాంగానికి లోబడి పని చేస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రొటోకాల్ విషయంలో అధికారులకే బాధ్యత ఉంటుందని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తల కోసం...

భారత్ విదేశాంగ విధానం భేష్

స్మార్ట్ ఫోన్ ఆ సైనికుడి ప్రాణాలు కాపాడింది

కేటీఆర్ టూర్ లో విచ్చలవిడిగా ఫ్లెక్సీలు..నేతలకు ఫైన్