తెలంగాణలో నిప్పుల కొలిమి

తెలంగాణలో నిప్పుల కొలిమి
  •      నిడమనూరులో అత్యధికంగా 43.5 డిగ్రీలు

ఆదిలాబాద్, వెలుగు: రాష్ట్రంలో నిప్పుల కొలిమిలా మారింది. వారం రోజుల నుంచి 40 నుంచి 43 డిగ్రీల  ఉష్ణోగ్రతలు నమోదవుతూనే ఉన్నాయి. గురువారం సైతం నల్గొండ జిల్లా లోని నిడమనూరు 43.5, ఇబ్రహిం పేట 43.5, కనగల్ 43.4, మడుగుపల్లి 43.3, గద్వాల జిల్లా ధరూర్ 43.4, ఆసిఫాబాద్ 43.3, గద్వాల వడ్డెపల్లి 43.3, సంగారెడ్డి సదశివపేట 43.2, బుగ్గబావిగూడ 43.2, కుమ్రం భీం వంకులం 43,  ఆయా జిల్లాలోని పది ప్రాంతాల్లో  42 డిగ్రీలు, 14  ప్రాంతాల్లో 41 డిగ్రీలు, ఐదు ప్రాంతాల్లో 40 డిగ్రీల టెంపరేచర్స్ నమోదయ్యాయి. దాదాపు రాష్ట్రమంతట అన్ని జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటుతున్నాయి. ఉదయం 9 గంటలకే 41 డిగ్రీలు నమోదైంది. గంట గంటకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.