ముగిసిన రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్​ పోటీలు

మిర్యాలగూడ, వెలుగు : పట్టణంలోని హౌసింగ్​ బోర్డులో క్లియో స్పోర్ట్స్​అరేనాలో ఈ నెల 19న ప్రారంభమైన రాష్ర్టస్థాయి బ్యాడ్మింటన్​ అండర్– 13 సబ్ ​జూనియర్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యాడ్మింటన్​ అసోసియేషన్​ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ అథారిటీ సహకారంతో ప్రారంభమైన ఈ పోటీల్లో రాష్ర్టంలోని పలు జిల్లాల నుంచి 198 మంది క్రీడాకారులు 
హాజరయ్యారు. కాగా చివరి రోజు పోటీలు హోరాహోరీగా సాగాయి. బాయ్స్​ సింగిల్స్​ విభాగంలో సూర్యాపేటకు చెందిన నిషాంత్​ భూక్యా మొదటి స్థానం సాధించగా,  వనమాల శశాంక్​ ద్వితీయ స్థానంలో నిలిచాడు.

ఇదే విభాగంలో సూర్యాపేట, హైదరాబాద్​ఆటగాళ్లు అఖిలేశ్​గౌడ్​,కె. మణిత్​మూడు, నాలుగు  స్థానాల్లో నిలిచారు. బాలికల సింగిల్స్​ విభాగంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన చంద్రం హంసిని, ఆరాధ్యరెడ్డి మొదటి రెండు స్థానాల్లో నిలువగా,  తాడూరి వైనవి, అవిని విక్రమ్​ మూడు, నాలుగు స్థానాలు సాధించారు.  బాయ్స్​ డబుల్స్ విభాగంలో సూర్యాపేట ప్లేయర్​భూక్యా నిషాంత్, అఖిలేశ్​గౌడ్​ జోడీ విజేతగా నిలిచింది. హైదరాబాద్​కు చెందిన  పి. క్రిషవ్, టి. అభిరాం జోడీ రన్నర్స్​గా నిలిచారు. అక్షత్​రెడ్డి, వజ్ర, చిన్మయ్​, జి. అస్మిత్​రెడ్డి మూడు, నాలుగు స్థానాలు సాధించారు. బాలికల డబుల్స్​ విభాగంలో ఆరాధ్యరెడ్డి, అవని విన్నర్స్​గా నిలువగా హంసిని, రిత్విక శ్రీ ద్వితీయ స్థానం సాధించారు.

బాలమన్విత రెడ్డి, తాడూరి వైనవి, శ్రీ ధన్య, శ్రీదీత్య మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. విజేతలకు టీఎస్​ఐఐసీ చైర్మన్​గ్యాదరి బాలమల్లు, తెలంగాణ స్పోర్ట్స్​అథారిటీ చైర్మన్​ ఎ. వెంకటేశ్వర్​రెడ్డి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్టూడెంట్లు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. రాష్ర్టస్థాయి పోటీల నిర్వహణకు జిల్లా  బ్యాడ్మింటన్​ అసోసియేషన్​ ట్రెజరర్​  శ్రీధర్​ ముందుకు వచ్చి ఆర్థిక సహకారం అందించటం అభినందనీయమన్నారు. తెలంగాణ స్పోర్ట్స్​ అథారిటీ నుంచి క్రీడలకు అవసరమైన సహకారం అందిస్తామన్నారు. డీఎస్పీ వై. వెంకటేశ్వరరావు, మున్సిపల్​ ఫ్లోర్​ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి, సీఐలు సురేశ్, రాఘవేందర్, రంగా వర్ష, శ్రీరామ్​, జిల్లా కోచ్​ మారబోయిన రామకృష్ఱ, పీడీ వెంకటేశ్వర్లు 
పాల్గొన్నారు.