హనుమకొండ సిటీ, వెలుగు : రాష్ట్ర స్థాయి సీఎం కప్ అథ్లెటిక్స్ , రెజ్లింగ్ పోటీలు గురువారం హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి సీఎం ఓఎస్డీ రవీందర్ రెడ్డి చీప్ గెస్ట్ గా హాజరై విజేతలకు మెడల్స్ అందజేశారు. హనుమకొండ జిల్లాకు చెందిన రెజ్లర్లు 4 గోల్డ్, ఒక సిల్వర్, రెండు బ్రౌంజ్ మెడల్స్ సాధించారు.
పతకాలు సాధించిన విజేతలను హనుమకొండ జిల్లా క్రీడలు,యువజన అధికారి గుగులోతు అశోక్ కుమార్, తెలంగాణ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ కార్యదర్శి ఎండీ కరీం, వరంగల్, హనుమకొండ జిల్లారెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శులు యాదగిరి సుధాకర్, రియాజ్, కోచ్ లు కందికొండరాజు, ఎం జైపాల్ అభినందించారు.