రెండు రోజుల్లో రూ.415 లక్షల కోట్లు ఆవిరి.. అమెరికా ఇన్వెస్టర్లకు భారీ నష్టం

రెండు రోజుల్లో  రూ.415 లక్షల కోట్లు ఆవిరి.. అమెరికా ఇన్వెస్టర్లకు భారీ నష్టం
  • మాంద్యం రావొచ్చంటున్న ఎక్స్​పర్టులు

న్యూఢిల్లీ: టారిఫ్​ వార్​ కారణంగా అమెరికా స్టాక్​మార్కెట్లు కుదేలవుతున్నాయి. ముఖ్యంగా చైనా కూడా 34 శాతం టారిఫ్​లు వేస్తామని హెచ్చరించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్​దెబ్బతింది.  గత రెండు రోజుల్లో యూఎస్​ ఇన్వెస్టర్ల సంపద ఐదు ట్రిలియన్​ డాలర్లు (దాదాపు రూ.415 లక్షల కోట్లు) తగ్గింది. ఈ పరిణామం ఆర్థిక నిపుణులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, ఆర్థిక అనిశ్చితి వల్ల రాబోయే రోజుల్లో మాంద్యం తప్పదని హెచ్చరిస్తున్నారు. కరోనా తరువాత ప్రధాన ఇండెక్స్​లు ఇంతలా పడిపోవడం ఇదే మొదటిసారి. 

శుక్రవారం ఎస్ అండ్​పీ ఆరు శాతం, డోజోన్స్​ ఇండస్ట్రియల్​యావరేజ్​ 5.5 శాతం నష్టపోయాయి. నాస్​డాక్​ కాంపోజిట్​5.8 శాతం, రస్సెస్​ 4.4 శాతం తగ్గింది. ఈవారంలో ఇప్పటి వరకు నాస్​డాక్​ 10 శాతం, ఎస్​ అండ్​పీ 9.1 శాతం, రస్సెల్​ 9.7 శాతం పడిపోయాయి. ఎన్​విడియా, టెస్లా వంటి పెద్ద కంపెనీల షేర్లు ఏడుశాతం వరకు తగ్గాయి. అమెరికాలో లిస్టయిన చైనా కంపెనీలు అలీబాబా, బైదు షేర్లూ భారీగా పడ్డాయి. జపాన్​, యూరోపియన్​ స్టాక్స్​కూడా నేలచూపులు చూస్తున్నాయి. 

చమురు ధరలు నాలుగేళ్ల కనిష్టానికి చేరాయి. ట్రెజరీల రాబడులు పెరిగాయి.  ట్రంప్​ అధికారంలోకి వచ్చినప్పటికీ యూఎస్ ​ఇన్వెస్టర్లు ఎనిమిది ట్రిలియన్​ డాలర్లు నష్టపోయారు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని మార్కెట్​స్ట్రాటజిస్టులు సూచిస్తున్నారు.