అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో తుఫాను బీభత్సం సృష్టించింది. పోర్ట్ కెనావెరల్‌లో నిలిపి ఉంచిన రాయల్ కరేబియన్ క్రూయిజ్ షిప్ అలల తాకిడికి అతలాకుతలమైంది. ప్రయాణికులు ఎక్కిన కొద్దిసేపటికే పెను తుఫానులో ఈ క్రూయిజ్చిక్కుకుంది. ఆకస్మికంగా వచ్చిన తుఫాను కారణంగా క్రూయిజ్డెక్ నుండి అలలు పెద్ద ఎత్తున పోటెత్తాయి.
ప్రయాణికులు, సిబ్బంది క్రూయిజ్ షిప్ నుంచి బయటపడేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో ప్రయాణికులు అరుపులు, కేకలు వేశారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ప్రాణభయంతో పరుగులు తీశారు. ఇక.. లాంజ్‌లో ఉన్న కుర్చీలు, గొడుగులన్నీ అలల తాకిడికి ఎగిరిపోయాయి. పలువురికి గాయాలైనట్లు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ALSOREAD:జూన్ 25 నుంచి జూలై 6 వరకు రైళ్లు రద్దు
యూఎస్ మిడ్‌వెస్ట్, సౌత్‌లో తుఫానుల కారణంగా పదుల సంఖ్యలో ఇండ్లు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఇండియానా, అర్కాన్సాస్‌లలో ముగ్గురు చనిపోయినట్టు అధికారులు తెలిపారు. సెంట్రల్ ఇండియానా. అర్కాన్సాస్‌లో పలు టోర్నడోలు, తీవ్రమైన తుఫానులు సంభవించినట్లు నేషనల్ వెదర్ సర్వీస్ తెలిపింది.