పొర్లుదండాలతో కార్మికుల నిరసన

ఆసిఫాబాద్, వెలుగు: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మె ఆదివారం 11వ రోజుకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని వేడుకుంటూ వర్షాన్ని లెక్కచేయకుండా ఆసిఫాబాద్ కలెక్టరేట్ కార్యాలయం ముందు కార్మికులు పొర్లు దండాలతో నిరసన తెలిపారు. మాట్ల రాజు, సమ్మయ్య, మహేశ్, నగేశ్ పాల్గొన్నారు.

ALSO READ :బంగారు తెలంగాణ కాదు.. అప్పుల తెలంగాణగా మార్చిన్రు : బోస్లే మోహన్ రావు పటేల్

కార్మికుల బిక్షాటన

ఖానాపూర్/ కడెం: ఖానాపూర్ పట్టణంతో పాటు కడెం మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు నిరసన కొనసాగించారు. ఎంపీపీ ఆఫీస్ నుంచి ర్యాలీగా దుకాణాల వద్దకు వెళ్లి  భిక్షాటన చేసి నిరసన తెలిపారు. తమ స మస్యలను ప్రభుత్వం పట్టించుకోకుండా కాలయాపన చేయడం సరికాదన్నారు.