
ధారూర్ మండలంలో స్టూడెంట్ల ఆందోళన
వికారాబాద్, వెలుగు : వికారాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులు ఇన్టైమ్కు వచ్చేలా చూడాలని ధారూర్ మండల పరిధిలోని గ్రామాలకు చెందిన స్టూడెంట్లు డిమాండ్ చేశారు. దోర్నాల్, ఆమ్ పల్లి, కుక్కిందా, హౌసుపల్లి, కొండాపురం, ధారూర్ స్టేషన్ ప్రాంతాలకు చెందిన స్టూడెంట్లు బుధవారం ధారూరు మండల కేంద్రంలోని మెయిన్ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఆర్టీసీ బస్సులు టైమ్‌కు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని.. డిపో మేనేజర్ స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నవీన్ మాట్లాడుతూ.. ధారూర్ మండలంలోని చుట్టుపక్కల గ్రామాల నుంచి వికారాబాద్‌లోని స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే స్టూడెంట్లు బస్సు కోసం ఉదయం 9 గంటల వరకు వెయిట్ చేయాల్సి వస్తోందన్నారు.
తిరిగి సాయంత్రం గ్రామాలకు చేరుకోవాలంటే రాత్రి 7 దాటినా బస్సులు రావట్లేదన్నారు. డిపో మేనేజర్ స్పందించి ఇన్‌టైమ్‌లో బస్సులు వచ్చేలా చూడాలని ఆయన కోరారు. లేకపోతే వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో రాస్తారోకోలు చేస్తామన్నారు. ఆందోళనలో స్టూడెంట్లు జేరెడ్డి, రాజేశ్, నందు, యాదేశ్, శ్రీధర్, ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు.