నల్గొండ జిల్లా అనుముల మండలం హాలియా జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం సమయంలో తమకు పురుగుల అన్నం వడ్డిస్తున్నారంటూ నిరసన చేపట్టారు. ఇదే విషయాన్ని సంబంధిత టీచర్లకు చెబితే.. అదే భోజనం చేయాలంటూ తమను బెదిరిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. గత వారం నుంచి పురుగుల అన్నం పెడుతున్నారంటూ ప్రిన్సిపాల్ ను నిలదీసిన విద్యార్థులు.
పురుగుల అన్నం వడ్డిస్తే తాము ఎలా తిని.. చదువుకోవాలని ప్రశ్నిస్తున్నారు విద్యార్థులు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల చదువుల కోసం కోట్లు ఖర్చుపెడుతుంటే కొన్ని చోట్ల పురుగుల అన్నం వడ్డిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థి సంఘం నాయకులు. వారం నుంచి తినే పుడ్ లో పరుగులు వస్తున్నాయని చెప్పినా.. పట్టించుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.