ప్రిన్సిపల్, వార్డెన్ వేధిస్తున్నారంటూ విద్యార్థుల ఆందోళన

రాజన్న సిరిసిల్ల జిల్లా : ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలోని తెలంగాణ స్టేట్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపల్ జ్యోతిలక్ష్మి, వార్డెన్ రమ్య, అటెండర్ రామస్వామి తమను వేధిస్తూ.. దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ దాదాపు 50 మంది విద్యార్థినీలు నిరసనకు దిగారు. తెల్లవారుజామున 5 గంటలకే ఆందోళన చేపట్టారు.

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో బైఠాయించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. నిరసన చేస్తున్న విద్యార్థినులకు విద్యార్థి సంఘాల నాయకులు మద్దతు పలికారు. మరోవైపు ఆందోళన చేస్తున్న విద్యార్థులను స్థానిక బీఆర్ఎస్ నాయకులు శాంతింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తమకు న్యాయం చేసేంత వరకూ కదిలేది లేదంటూ చలిలోనే భీష్ముంచు కూర్చున్నారు విద్యార్థినీలు.