- తెలంగాణ వాతావరణ శాఖ ప్రకటన
హైదరాబాద్: ఎండలు రోజు రోజుకూ ముదురుతున్నాయి. రాగల 5 రోజుల్లో ఎండల తీవ్రత అక్కడక్కడ 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని తెలంగాణ వాతావరణ శాఖ ప్రకటించింది. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని కొద్దిసేపటి క్రితం జారీ చేసిన తాజా బులెటిన్ లో పేర్కొంది. ఈరోజు నుండి రాగల 5 రోజులలో తెలంగాణ రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్ వరకు అక్కడక్కడ పెరిగే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది.
అక్కడక్కడ ఎండల తీవ్రత గరిష్టంగా పెరగడం మినహా రాగల మూడు రోజులు తెలంగాణా రాష్ట్రానికి ఎలాంటి వాతావరణ హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది. విదర్భ నుండి ఉత్తర కేరళ వరకు ఉన్న ఉపరితల ద్రోణి ఈ రోజు ఛత్తీస్ ఘడ్ నుండి తెలంగాణా మీదగా ఇంటీరియర్ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం నుండి సుమారు 0.9కిమి ఎత్తు వరకు కొనసాగుతోందని, ఏప్రిల్ 1 మరియు 02 తేదీలలో రాష్ట్రంలోని వాయువ్య జిల్లాలలో వడగాలులు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఇవి కూడా చదవండి
సైంటిస్టుల కంటే రైతులకే బాగా తెలుసు