
ఆదిలాబాద్టౌన్, వెలుగు: ఆదిలాబాద్జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. వేడిగాలులు దడ పుట్టిస్తున్నాయి. తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. గడిచిన వారంలో ఉష్ణోగ్రతలు 40.1 డిగ్రీల కంటే తక్కువగా నమోదు కాలేదు. ఆదివారం ఏకంగా 43.8 ఉష్ణోగ్రత నమోదవడంతో ప్రజలు వేడిమి తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరయ్యారు. దీంతో వడదెబ్బ బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నతున్న వారి సంఖ్య పెరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఎక్కువసేపు ఎండలో పని చేయొద్దని, తిరగొద్దని చెప్తున్నారు. -నిత్యం మంచినీరు తాగాలని సూచిస్తున్నారు. పిల్లల పట్ల జాగ్రత్త వహించాలని, ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వారిని బయటకు పంపొద్దని పేర్కొంటున్నారు.
వారం రోజులుగా జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతలు
తేదీ గరిష్టం కనిష్టం
14 41.3 26.7
15 40.3 27.7
16 41.6 26.7
17 40.8 27.7
18 41.8 29.2
19 41. 28.2
20 43. 25.2