వడ్డీపై వడ్డీ త్వరగా మాఫీ చేయండి..కేంద్రానికి సుప్రీం ఆదేశం

న్యూఢిల్లీ: వడ్డీపై వడ్డీ మాఫీని ఎంత వీలైతే అంత త్వరగా అమలు చేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. లోన్ మారటోరియంపై వడ్డీని మాఫీ చేసే అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోన్న సందర్భంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. రూ.2 కోట్ల వరకున్న లోన్లకు మారటోరియం కాలంలో వడ్డీపై వడ్డీని మాఫీ చేయగలమని కేంద్ర ప్రభుత్వం ఈ నెల 2న సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌‌లో పేర్కొంది. ఈ నిర్ణయం అమలు చేసేందుకు వచ్చే నెల 15 వరకు ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అపెక్స్‌‌ కోర్టుకు చెప్పారు. ‘బ్యాంక్‌‌లు మొదట వడ్డీపై వడ్డీని మాఫీ చేయాలి. ఆ తర్వాత ప్రభుత్వం ఆ మొత్తాన్ని పరిహారంగా అందిస్తుంది. వడ్డీపై వడ్డీ మాఫీ లెక్కలు డిఫరెంట్‌‌గా ఉంటాయి. బ్యాంక్‌‌లు సరియైన ఫార్మాట్‌‌ను పంపాల్సి ఉంటుంది’ అని మెహతా చెప్పారు.

అయితే ప్రభుత్వం తమ నిర్ణయాన్ని అమలు చేయడాన్ని ఆలస్యం చేయకూడదని జస్టిస్ అశోక్ భూషన్, ఆర్ సుభాష్ రెడ్డి, ఎంఆర్ షాలతో కూడిన ముగ్గురు సభ్యులున్న బెంచ్ చెప్పింది. ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి ఇంకా నెల సమయం ఎందుకు? రూ.2 కోట్ల వరకు లోన్లు ఉన్న బారోవర్స్‌‌కు వడ్డీపై వడ్డీని మాఫీ చేసే నిర్ణయాన్ని ప్రభుత్వం ఎంత వీలైతే అంత త్వరగా అమలు చేయాలని బెంచ్ ఆదేశించింది. కామన్ మాన్ దివాళి ఇప్పుడు ప్రభుత్వ చేతిలోనే ఉందని బెంచ్ వ్యాఖ్యానించింది. కామన్ మాన్ చాలా ఆందోళనకరంగా ఉన్నారని చెప్పింది.

స్టాండర్డ్ అకౌంట్లకే..

ఈ ఏడాది మార్చి 1 వరకు ఎలాంటి డిఫాల్ట్స్ లేని స్టాండర్డ్ లోన్ అకౌంట్లను మాత్రమే లోన్ రీస్ట్రక్చరింగ్‌‌కు అనుమతిస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌‌‌‌బీఐ) క్లారిటీ ఇచ్చింది. కోవిడ్ 19 రిజొల్యూషన్ ఫ్రేమ్‌‌వర్క్ కింద వీటిని రీకాస్ట్ చేస్తామని చెప్పింది. మార్చి 1 నాటికే 30 రోజుల కంటే ఎక్కువ పీరియడ్‌‌ డిఫాల్ట్‌‌ అయిన లోన్ అకౌంట్లు కోవిడ్ 19 రిజొల్యూషన్ ఫ్రేమ్‌‌వర్క్ కింద అర్హులు కావని ఆర్‌‌‌‌బీఐ క్లారిటీ ఇచ్చింది. 2020 మార్చి 1 నాటికి స్టాండర్డ్‌‌గా గుర్తింపు పొందిన బారోవర్స్‌‌కు మాత్రమే ఈ ఫ్రేమ్‌‌వర్క్ అప్లయి అవుతుంది. ఒకే బారోవర్‌‌‌‌కు పలువురు లెండర్లు అప్పు ఇచ్చి ఉంటే.. అన్ని లెండింగ్ ఇన్‌‌స్టిట్యూషన్లు ఈ రిజొల్యూషన్ కింద ఇంటర్‌‌‌‌క్రెడిటార్ అగ్రిమెంట్‌‌లోకి వస్తాయని పేర్కొంది.