గ్రూప్-1 పరీక్ష ఫలితాల విడుదలకు లైన్ క్లియర్

గ్రూప్-1 పరీక్ష ఫలితాల విడుదలకు లైన్ క్లియర్
  • గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1 రిజల్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు లైన్ క్లియర్
  • జీవో 29 రద్దుపై దాఖలైన రెండు పిటిషన్లు కొట్టేసిన సుప్రీంకోర్టు
  • పిటిషనర్లు చాలా ఆలస్యంగాకోర్టుకు వచ్చారని వ్యాఖ్య 
  • ఫలితాలు ప్రకటించే టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ కేసులో జోక్యం చేసుకోలేమని వెల్లడి
  • జీవో 29 రద్దుపై దాఖలైన రెండు పిటిషన్లను కొట్టేసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో గ్రూప్ 1కు రిజల్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు లైన్ క్లియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 29ని రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో న్యాయపరంగా ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. జీవో -29ని రద్దు చేయాలని కోరుతూ శృతి, రాంబాబు, మంజుల, సుధాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు పలువురు గత నెల 22న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇందుకు సంబంధించి స్పెషల్ లీవ్ పిటిషన్లు(సివిల్) దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై సోమవారం జస్టిస్ పామిడిఘంటమ్ శ్రీ నరసింహా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ద్విసభ్య ధర్మాసనం విచారించింది. పిటిషనర్ల తరఫు సీనియర్ అడ్వొకేట్ ఆదిత్య సోంది, మోహిత్ రావు, తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వొకేట్ నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. తొలుత పిటిషనర్ల న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 29తో వేలాది మంది విద్యార్థులకు నష్టం జరిగే అవకాశం ఉందని బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నివేదించారు. జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేటగిరీలోని క్యాండిడేట్స్ కంటే ఎక్కువ మార్కులు సాధించిన వారిని అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజర్వుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గానే పరిగణిస్తుండటం వల్ల దివ్యాంగ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. వారి కంటే ఎక్కువ మార్కులు వచ్చినా రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేటగిరీగానే పరిగణించి 1:50 కింద అభ్యర్థులను మెయిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పిలవాలని అభ్యర్థించారు. అందువల్ల జీవో 29ని రద్దు చేయాలని, గ్రూప్ -1 పరీక్షలను మరోసారి నిర్వహించాలని కోరారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకొని ధర్మాసనం.. ఈ సమయంలో గ్రూప్ 1 అంశంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఆలస్యంగా కోర్టును ఆశ్రయించారని వ్యాఖ్యానించింది. ఇప్పటికే గ్రూప్-1 పరీక్షలు పూర్తయ్యాయని, ఫలితాలు ప్రకటించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీ పీఎస్సీ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినందని గుర్తుచేసింది. అందువల్ల ఈ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డిస్మిస్ చేస్తున్నట్లు వెల్లడించింది. కాగా, తెలంగాణలో గ్రూప్-1 పరీక్షలను వాయిదా వేయాలని, జీవో -29ని రద్దు చేయాలని పోగుల రాంబాబు గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఆ రిట్ పిటిషన్ కూడా సీజేఐ ధర్మాసనం తోసిపుచ్చింది.