న్యూఢిల్లీ: నీట్ పీజీ ఎగ్జామ్ – 2022ను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. నీట్ పీజీ ఎగ్జామ్ 22ను వాయిదా వేయాలని కోరుతూ కొందరు డాక్టర్లు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు మే 10న అంగీకరించింది. శుక్రవారం కేసును విచారించిన సుప్రీం ధర్మాసనం ఎగ్జామ్ వాయిదాకే నో చెప్పింది. ఈ మేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ సమయంలో పరీక్షలను వాయిదా వేస్తే దాదాపు 2 లక్షల 6 వేల మంది డాక్టర్ల భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతుందని ధర్మాసనం పేర్కొంది. అంతే కాకుండా దేశంలో డాక్టర్ల కొరత ఏర్పడి... రోగులు ఇబ్బందిపడే పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కొంత మంది అభ్యర్థలు పరీక్షను వాయిదా వేయమని కోరుతున్నారని... అయితే అత్యధిక మంది ఎగ్జామ్ నిర్వహించాలని కోరుకుంటున్నారని కోర్టు తెలిపింది. ఇక ప్రభుత్వం కూడా పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసిందని... ఈ సమయంలో ఎగ్జామ్ వాయిదా నిర్ణయం తీసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.
SC rejects plea seeking NEET-PG 2022 postponement
— ANI Digital (@ani_digital) May 13, 2022
Read @ANI Story | https://t.co/5y5eDhDJb5#NEETPG #NEETPG2022 #SupremeCourt pic.twitter.com/Rt6BsGHsix
మరిన్ని వార్తల కోసం...