ఎన్నికల్లో EVM విధానం రద్దు చేయాలన్న పిటిషన్ కొట్టివేసిన సుప్రీం కోర్టు

ఎన్నికల్లో EVM విధానం రద్దు చేయాలన్న పిటిషన్ కొట్టివేసిన సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ: ఎన్నికల్లో బ్యాలెట్ విధానాన్ని అనుసరించినంత మాత్రాన అవినీతి ఆగిపోతుందని చెప్పగలరా..? అని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్‎ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దేశంలో ఈవీఎం విధానాన్ని రద్దు చేసి బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించేందుకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‎ను అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. విదేశాల్లో బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు జరగుతున్నాయని, భారత్ లో కూడా అలాగే నిర్వహిస్తే బాగుంటుందని ఆయన తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. 

ఎన్నికల సందర్భంగా దేశంలో వేల కోట్ల అవినీతి జరుగుతుందని ఆరోపించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. మీరు గెలిస్తే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరగలేదు. ఓడిపోతే ఎలక్ట్రానిక్ ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినట్టు. బ్యాలెట్ విధానం అనుసరిస్తే అవినీతి ఆగిపోతుందని మీరు చెప్పగలరా? అని ప్రశ్నించింది. అనంతరం పిటిషన్ ను కొట్టేసింది.