భారత సర్వోన్నత న్యాయస్థానం డిసెంబరు 11న ఆర్టికల్ 370 , 35(A) రద్దుపై చారిత్రాత్మకమైన తీర్పును వెలువరించింది. సుప్రీంకోర్టు తన తీర్పు ద్వారా భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రతను సమర్థించింది, ఇది ప్రతి భారతీయుడికి ఎంతో సంతోషదాయకం. 2019 ఆగస్టు 5న కేంద్రం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ సమగ్రతను పెంపొందించే ఉద్దేశ్యంతోనే జరిగిందని, విచ్ఛిన్నం కాదని సుప్రీంకోర్టు గమనించింది. ఆర్టికల్ 370 శాశ్వతం కాదనే వాస్తవాన్ని సుప్రీంకోర్టు కూడా గుర్తించింది. జమ్మూ, కాశ్మీర్, లడఖ్ ప్రకృతి రమణీయ దృశ్యాలు, నిర్మలమైన లోయలు, గంభీరమైన పర్వతాలు తరతరాలుగా కవులు, కళాకారులు, సాహసికుల హృదయాలను దోచుకున్నాయి. ఇక్కడ హిమాలయాలు ఆకాశాన్ని తాకుతాయి. సరస్సులు, నదుల సహజ జలాలు స్వర్గాన్ని ప్రతిబింబిస్తాయి. కానీ, గత ఏడు దశాబ్దాలుగా, ఈ ప్రదేశాలు అత్యంత దారుణమైన హింస, అస్థిరతకు సాక్ష్యంగా నిలిచాయి.
దురదృష్టవశాత్తు, శతాబ్దాల వలసరాజ్యాల కారణంగా, ముఖ్యంగా ఆర్థిక, మానసిక అణచివేత కారణంగా, గందరగోళ సమాజంగా మారింది.. చాలా ప్రాథమిక విషయాలపై స్పష్టమైన వైఖరిని తీసుకోకుండా, ద్వంద్వ ప్రమాణాలను అనుమతించడం గందరగోళానికి దారితీసింది. దీంతో దురదృష్టవశాత్తు జమ్మూ కాశ్మీర్ పెద్ద బాధితురాలైంది. స్వాతంత్య్రం వచ్చినప్పుడు, జాతీయ సమైక్యత కోసం కొత్త ప్రారంభాన్ని ఎంచుకోవడానికి మనకు అవకాశం ఉంది. బదులుగా, దీర్ఘకాలిక జాతీయ ప్రయోజనాలను విస్మరించడం జరిగింది.
అటల్జీ సందేశం స్ఫూర్తిదాయకం
నా జీవితంలో చాలా కాలం నుంచి జమ్మూ కాశ్మీర్ ఆందోళన్‌తో అనుసంధానం అయ్యే అవకాశం లభించింది. నేను జమ్మూ కాశ్మీర్ కేవలం రాజకీయ సమస్య కానటువంటి సైద్ధాంతిక చట్రానికి చెందినవాడిని. డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ నెహ్రూ క్యాబినెట్‌లో ముఖ్యమైన పోర్ట్‌ఫోలియోను కలిగి ఉన్నారు. అయినప్పటికీ ఆయన కాశ్మీర్ సమస్యపై క్యాబినెట్ నుంచి వైదొలిగారు. కఠినమైన రహదారిని ఎంచుకున్నారు. ఆయన ప్రయత్నాలు, త్యాగం కోట్లాది మంది భారతీయులను కాశ్మీర్ సమస్యతో మానసికంగా అతుక్కుపోయేలా చేసింది. కొన్ని సంవత్సరాల తర్వాత, శ్రీనగర్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో అటల్ జీ 'ఇన్సానియత్', 'జంహూరియత్' 'కాశ్మీరియత్' అనే శక్తిమంతమైన సందేశాన్ని ఇచ్చారు, ఈ సందేశం ఎల్లప్పుడూ గొప్ప స్ఫూర్తికి మూలం. జమ్మూ కాశ్మీర్‌లో జరిగింది మన దేశానికి, అక్కడ నివసించే ప్రజలకు జరిగిన ఘోర ద్రోహం అని నా దృఢ విశ్వాసం. ప్రజలకు జరిగిన ఈ అన్యాయాన్ని తొలగించడానికి నేను చేయగలిగినదంతా చేయాలనేది నా బలమైన కోరిక. జమ్మూ కాశ్మీర్ ప్రజల కష్టాలను తీర్చేందుకు నేను ఎప్పటి నుంచో కృషి చేయాలనుకుంటున్నాను. ప్రధానంగా చెప్పాలంటే- ఆర్టికల్ 370, 35 (A) ప్రధాన అడ్డంకులు లాంటివి. ఇది పగలని దృఢమైన గోడలా అనిపించింది. బాధితులు, పేదలు, అణగారినవారు. ఆర్టికల్ 370, 35(A) జమ్మూ కాశ్మీర్ ప్రజలకు వారి ఇతర తోటి భారతీయులకు లభించే హక్కులు, అభివృద్ధిని ఎప్పటికీ పొందలేరని నిర్ధారిస్తుంది. ఈ ఆర్టికల్స్ కారణంగా, ఒకే దేశానికి చెందిన ప్రజల మధ్య దూరం ఏర్పడింది. ఈ దూరం కారణంగా, జమ్మూ కాశ్మీర్ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలనుకునే మన దేశం నుంచి చాలా మంది ప్రజలు అక్కడి ప్రజల బాధను స్పష్టంగా అనుభవించినప్పటికీ తగిన పరిష్కారం చేయలేకపోయారు.
వెయ్యికోట్ల ప్రత్యేక సహాయం
గత కొన్ని దశాబ్దాలుగా సమస్యను నిశితంగా చూసిన కార్యకర్తగా, సమస్య, సంక్లిష్టతలపై నాకు అవగాహన ఉంది. అయినప్పటికీ నాకు ఒక విషయం గురించి పూర్తి స్పష్టత ఉంది.- జమ్మూ కాశ్మీర్ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. వారు తమ బలం, నైపుణ్యాల ఆధారంగా భారతదేశ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నారు. తమ పిల్లల మెరుగైన జీవనం కోసం హింస, అనిశ్చితి లేని జీవితాన్ని కూడా కోరుకున్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలకు సేవ చేస్తున్నప్పుడు, పౌరుల ఆందోళనను అర్థం చేసుకోవడం, సహాయక చర్యల ద్వారా విశ్వాసాన్ని పెంపొందించడం, అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం అనే మూడు స్తంభాలకు మేము ప్రాధాన్యత ఇచ్చాము. 2014లో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే జమ్మూ కాశ్మీర్‌లో ఘోరమైన వరదలు సంభవించాయి. కాశ్మీర్ లోయలో చాలా నష్టం జరిగింది. సెప్టెంబరు 2014లో నేను పరిస్థితిని అంచనా వేయడానికి శ్రీనగర్‌కు వెళ్లి రూ. 1000 కోట్లు పునరావాసం కోసం ప్రత్యేక సహాయం ప్రకటించడం, సంక్షోభ సమయంలో ప్రజలను ఆదుకోవడానికి మా ప్రభుత్వం నిబద్ధతను సూచిస్తోంది. జీవితంలో అన్ని వర్గాల ప్రజలను కలిసే అవకాశం నాకు లభించింది. - ప్రజలు అభివృద్ధిని కోరుకోవడమే కాకుండా దశాబ్దాలుగా ప్రబలిన అవినీతి నుంచి విముక్తిని కూడా కోరుకున్నారు. అదే సంవత్సరం, జమ్మూ కాశ్మీర్‌లో మనం కోల్పోయిన వారి జ్ఞాపకార్థం దీపావళిని జరుపుకోకూడదని నిర్ణయించుకున్నాను. దీపావళి రోజున నేను కూడా జమ్మూ కాశ్మీర్‌లో ఉండాలని నిర్ణయించుకున్నాను.
నిరాశ, నిస్పృహల స్థానంలో అభివృద్ధి
ఆగస్టు 5, 2019 అన్నింటినీ మార్చేసింది. ఇప్పుడు అన్ని కేంద్ర చట్టాలు అనుకూలంగా వర్తిస్తాయి, ప్రాతినిధ్యం కూడా మరింత విస్తృతమైంది- మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అమలులో ఉంది, బీడీసీ ఎన్నికలు జరిగాయి. శరణార్థ సంఘాలు అభివృద్ధి ఫలాలను ఆస్వాదించడం ప్రారంభించాయి. కీలకమైన కేంద్ర ప్రభుత్వ పథకాలు సంతృప్త స్థాయిని అందించాయి. తద్వారా సమాజంలోని అన్ని వర్గాలను కవర్ చేసేలా వీటిలో సౌభాగ్య, ఉజ్వల పథకాలు ఉన్నాయి. గృహనిర్మాణం, కుళాయి నీటి కనెక్షన్‌తో ఆర్థిక పురోగతి సాధ్యమైంది. అన్ని గ్రామాలు ఓడీఎఫ్ ప్లస్ గణాంకాలను సాధించాయి. ప్రభుత్వ ఖాళీలను పారదర్శకంగా, ప్రక్రియ ఆధారితంగా భర్తీ చేశారు. ఐఎంఆర్ వంటి ఇతర సూచికలు మెరుగ్గా ఉన్నాయి. మౌలిక సదుపాయాలు, పర్యాటక రంగానికి ఊతమివ్వడం ప్రతి ఒక్కరూ చూడగలిగేలా ఉంది. ఈ క్రెడిట్ సహజంగా జమ్మూ కాశ్మీర్ ప్రజల దృఢత్వానికి చెందుతుంది, వారు అభివృద్ధిని మాత్రమే కోరుకుంటున్నారని, ఈ సానుకూల మార్పుకు చోదకులుగా ఉండటానికి సిద్ధంగా ఉన్నామని పదే పదే తెలిపారు. గతంలో జమ్మూ, కశ్మీర్, లడఖ్‌ల హోదా ప్రశ్నార్థకమైంది. ఇప్పుడు రికార్డుస్థాయిలో అభివృద్ధి, రికార్డు స్థాయిలో పర్యాటకుల ప్రవాహం పెరిగింది. డిసెంబర్ 11న సుప్రీంకోర్టు తన తీర్పులో ‘ఏక్ భారత్, శ్రేష్ట భారత్’ స్ఫూర్తిని బలోపేతం చేసింది. నేడు జమ్మూ, కాశ్మీర్, లడఖ్‌లో నిరాశ, నిస్పృహల స్థానంలో అభివృద్ధి, ప్రజాస్వామ్యం, ఆత్మగౌరవం పరిఢవిల్లుతున్నాయి.
పంచాయతీ ఎన్నికలు కీలకఘట్టం
ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి జరిగిన పంచాయతీ ఎన్నికలు ఒక కీలక ఘట్టం. మరోసారి మేము అధికారంలో కొనసాగడం లేదా మా సూత్రాలకు కట్టుబడి ఉండాలనే ఎంపికను ఎదుర్కొన్నాం. ఎంపిక ఎప్పుడూ కఠినమైనది కాదు. మేము ఆదర్శాలు, జమ్మూ ప్రజల ఆకాంక్షలు, కాశ్మీర్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. పంచాయతీ ఎన్నికల విజయం జమ్మూ కాశ్మీర్ ప్రజల ప్రజాస్వామ్య స్వభావాన్ని సూచించింది. గ్రామాల నుంచి వచ్చిన ‘ప్రధానులు’తో చర్చించి ఒక అభ్యర్థన చేశాను.- ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలలను తగలబెట్టకూడదని, దానికి వారు కట్టుబడి ఉండటం చూసి నేను సంతోషించాను. పాఠశాలలు తగలబడితే బాధపడేది చిన్న పిల్లలే. ఆగస్టు 5వ తేదీ చారిత్రాత్మకమైన రోజు. ఆ రోజు ప్రతి భారతీయుడి హృదయంలో నిలిచిపోయింది. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ మన పార్లమెంటు చారిత్రాత్మక నిర్ణయాన్ని ఆమోదించింది. అప్పటి నుంచి జమ్మూ, కాశ్మీర్, లడఖ్‌లలో చాలా మార్పులు వచ్చాయి. డిసెంబరు 2023లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది, జమ్మూ, కాశ్మీర్, లడఖ్ అంతటా జరుగుతున్న అభివృద్ధిని చూసి, నాలుగు సంవత్సరాల పాటు ఆర్టికల్ 370 మరియు 35(ఎ)ని రద్దు చేస్తూ పార్లమెంటు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించడంతో ప్రజాకోర్టు ప్రతిధ్వనించింది.
పరివర్తన ప్రభావం చూశాం
జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి ప్రయాణాన్ని మరింత బలోపేతం చేయడానికి, మా ప్రభుత్వంలో మంత్రులు తరచుగా అక్కడికి వెళ్లి ప్రజలతో నేరుగా సంభాషించాలని మేము నిర్ణయించుకున్నాం. జమ్మూ కాశ్మీర్‌లో సుహృద్భావాన్ని పెంపొందించడంలో తరచుగా జరిపిన పర్యటనలు కూడా కీలక పాత్ర పోషించాయి. మే 2014 నుంచి మార్చి 2019 వరకు 150కి పైగా మంత్రుల పర్యటనలు జరగడం ఓ రికార్డు. 2015 ప్రత్యేక ప్యాకేజీ జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి అవసరాలను తీర్చడంలో ఒక ముఖ్యమైన అడుగు. ఇందులో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉద్యోగాల కల్పన, పర్యాటక ప్రోత్సాహం, హస్తకళ పరిశ్రమకు మద్దతు వంటి కార్యక్రమాలు ఉన్నాయి. మేము జమ్మూ కాశ్మీర్‌లో యువత కలలను, సామర్థ్యాన్ని గుర్తించి క్రీడా శక్తిని ఉపయోగించుకున్నాం. క్రీడా కార్యక్రమాల ద్వారా, వారి ఆకాంక్షలు, భవిష్యత్తులపై అథ్లెటిక్ సాధన, పరివర్తన ప్రభావాన్ని మేము చూశాం. క్రీడా వేదికలను మెరుగుపరచడంతోపాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి కోచ్‌లను అందుబాటులో ఉంచాం. స్థానిక ఫుట్‌బాల్ క్లబ్‌ల ఏర్పాటును ప్రోత్సహించడం అత్యంత ప్రత్యేకమైన విషయాలలో ఒకటి. ఫలితాలు అత్యద్భుతంగా ఉన్నాయి. ప్రతిభావంతులైన ఫుట్‌బాల్ క్రీడాకారిణి అఫ్షాన్ ఆషిక్ పేరు నాకు గుర్తుకు వస్తుంది-. డిసెంబర్ 2014లో ఆమె శ్రీనగర్‌లో రాళ్లు రువ్వే గ్రూప్‌లో భాగం. కానీ సరైన ప్రోత్సాహం అందించడంతో ఆమె ఫుట్‌బాల్ వైపు మళ్లింది, ఆమెను శిక్షణకు పంపడంతో ఆటలో రాణించింది. ఫిట్ ఇండియా డైలాగ్స్‌లో ఒకదానిలో ఆమెతో ఇంటరాక్ట్ అయినట్లు నేను గుర్తుచేసుకున్నాను. అక్కడ నేను ‘బెండ్ ఇట్ లైక్ బెక్‌హమ్’ అని చెప్పాను, ఎందుకంటే అది ఇప్పుడు ‘ఏస్ ఇట్ లైక్ అఫ్షాన్’. ఇతర యువకులు కిక్‌బాక్సింగ్, కరాటే, మరిన్నింటిలో మెరవడం ప్రారంభించారు.