- శేరిలింగంపల్లి జోన్లో న్యాక్ ఇంజనీర్ల తీరు ఇదీ..
మాదాపూర్, వెలుగు: జీహెచ్ఎంసీలో న్యాక్ ఇంజనీర్ల వ్యవస్థ గాడి తప్పింది. ఫీల్డ్‌లో తిరిగి అక్రమ నిర్మాణాలను గుర్తించి జీహెచ్ఎంసీ వెబ్సైట్లో అప్లోడ్చేయాల్సిన శేరిలింగంపల్లి జోన్ పరిధి న్యాక్ ఇంజ
నీర్లు ఆఫీసులకే పరిమితమవుతున్నారు. వీరిని టౌన్‌ప్లానింగ్ అధికారులు కంప్యూటర్ ఆపరేటర్లుగా ఉపయోగించుకుంటున్నారు. కోర్టు కేసులు, నోటీసుల జారీ వంటి పనులు చేయిస్తూ అఫీసులకే పరిమితం చేస్తున్నారు. అక్రమ సంపాదనకు గండిపడుతోందని కావాలనే వారిని ఫీల్డ్‌కు వెళ్లకుండా చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సర్కిల్‌కు ఒకరిద్దరే...
జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి జోన్లో చందానగర్, శేరిలింగంపల్లి, పటాన్చెరు, యూసుఫ్‌గూడ సర్కిళ్లు ఉన్నాయి. ఆయా సర్కిళ్లలో అక్రమ నిర్మాణాలను న్యాక్ ఇంజనీర్లు గుర్తించి వాటిని జీహెచ్ఎంసీ వెబ్‌సైట్‌లోని యూసీఐఎంఎస్లో అప్లోడ్ చేయాలి. ఆ నిర్మాణాలపై అధికారులు చర్యలు చేట్టాలి. అయితే, ఒక్కో డివిజన్‌కు ఒక్కో న్యాక్ ఇంజనీర్ఉండాల్సినప్పటికీ.. ప్రస్తుతం చందానగర్సర్కిల్లో నాలుగు డివిజన్లకు ఇద్దరే ఉన్నారు. శేరిలింగంపల్లి సర్కిల్లో మూడు డివిజన్లకు ఇద్దరే ఉన్నారు. శేరిలింగంపల్లి జోన్లో న్యాక్ఇంజనీర్లు ఫీల్డ్‌కు పోతలేరు. అఫీసులకే పరిమితమవుతూ టౌన్‌ప్లానింగ్ అధికారులు ఇచ్చే పనులే చేస్తున్నారు. తమ ఏరియాలో అక్రమ నిర్మాణం జరుగుతోందని ఎవరైనా స్థానికులు బిల్డింగ్ ఫొటోలు, అడ్రస్ పంపిస్తే వాటిని అప్‌లోడ్‌చేసి చేతులు దులుపుకుంటున్నారు.
చర్యలు తీసుకోని ఉన్నతాధికారులు
ఫీల్డ్‌లో అక్రమ నిర్మాణాలను గుర్తించి వాటిని వెబ్సైట్లో అప్లోడ్ చేయడం, వాటిపై చర్యలు తీసుకోవడం వల్ల టౌన్ప్లానింగ్అధికారుల అక్రమ ఆదాయం దెబ్బతింటోందని.. అందుకోసమే న్యాక్ ఇంజనీర్లను ఫీల్డ్‌కు వెళ్లకుండా డివిజన్చైన్మెన్లతో కుమ్మక్కై వారిని ఫీల్డ్‌కు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. తాము చెప్పింది వింటే మీకు అన్నీ రకాల సపోర్ట్ ఉంటుందంటూ వారిని దారికి తెచ్చుకుంటున్నారు. ఇందుకోసం న్యాక్ఇంజనీర్లకు ప్రతి నెలా కొంత అమౌంట్అందుతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారమంతా తెలిసినా.. ఉన్నతాధి కారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. న్యాక్ నోడల్ ఆఫీసర్, జోనల్ కమిషనర్ తమకేమీ తెలియదన్నట్లు వ్యవహరిస్తుండటం విమర్శలకు దారితీస్తోంది.