ఆఫ్గానిస్థాన్ పేరు మార్పు.. తాలిబన్లు పెట్టిన కొత్త పేరేంటంటే?

ఆఫ్గానిస్థాన్ పేరు మార్పు.. తాలిబన్లు పెట్టిన కొత్త పేరేంటంటే?

కాబూల్: అఫ్గానిస్థాన్ ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటుకు ముందే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 19న దేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశాన్ని 'ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్థాన్' గా ప్రకటించారు. 1996 నుంచి 2001 వరకు తమ పాలనలో కొనసాగించిన పేరునే తాలిబన్లు తిరిగి పెట్టడం గమనార్హం. 2001 తర్వాత అమెరికా రక్షణ బలగాలు అఫ్గాన్ ను తమ అధీనంలో తెచ్చుకోవడంతో ఆ పేరును మార్చారు. కానీ ఇప్పుడు మళ్లీ దేశం తమ చేతుల్లోకి రావడంతో తిరిగి పాత పేరునే తాలిబన్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ట్విట్టర్ ద్వారా కన్ఫర్మ్ చేశారు.