డాక్టర్ల నిర్లక్ష్యంతో పెరుగుతున్న శిశు మరణాలు

  •     సర్కార్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌లో 85 శాతం నార్మల్ డెలివరీలు చేయాలన్న సర్కార్‌‌‌‌‌‌‌‌
  •     టార్గెట్‌‌‌‌‌‌‌‌ దాటితే ఒక్కో  డెలివరీకి రూ. 3 వేల ఇన్సెంటివ్‌‌‌‌‌‌‌‌
  •     నెలలు నిండినా నొప్పులు రాకపోవడంతో ఇంజక్షన్లు ఇస్తున్న డాక్టర్లు
  •     ఆరోగ్య సమస్యలతో కడుపులోనే కన్నుమూస్తున్న శిశువులు

సూర్యాపేట, వెలుగు : ప్రభుత్వాసుపత్రుల్లో నార్మల్ డెలివరీలు పెంచాలని ప్రభుత్వం పెట్టిన టార్గెట్‌‌‌‌‌‌‌‌ కొన్ని సార్లు తల్లులకు కడుపుకోత మిగులుస్తోంది. టార్గెట్‌‌‌‌‌‌‌‌ను చేరుకోవాలని పైనుంచి ఒత్తిడి, టార్గెట్‌‌‌‌‌‌‌‌ను మించితే ఇన్సెంటివ్స్‌‌‌‌‌‌‌‌ ఇస్తుండడంతో డాక్టర్లు సైతం నార్మల్‌‌‌‌‌‌‌‌ డెలివరీ చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. ఆపరేషన్‌‌‌‌‌‌‌‌ చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ... నార్మల్‌‌‌‌‌‌‌‌ డెలివరీ జరిగేలా గర్భిణులకు ఇంజక్షన్లు ఇస్తున్నారు. దీంతో ఆరోగ్య సమస్యలు తలెత్తి శిశువులు తల్లి కడుపులోనే కన్నుమూస్తున్నారు. రెండు నెలల్లో సూర్యాపేట మాతాశిశు కేంద్రంలో ఇలాంటి మరణాలు 10 వరకు నమోదయ్యాయి. 

85 శాతం దాటితే ఇన్సెంటివ్‌‌‌‌‌‌‌‌

జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులలో 85 శాతం నార్మల్‌‌‌‌‌‌‌‌ డెలివరీలు చేయాలని సర్కార్‌‌‌‌‌‌‌‌ టార్గెట్‌‌‌‌‌‌‌‌ విధించింది. టార్గెట్‌‌‌‌‌‌‌‌ కంటే ఎక్కువ నార్మల్‌‌‌‌‌‌‌‌ డెలివరీలు చేసిన హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ స్టాఫ్‌‌‌‌‌‌‌‌కు ఇన్సెంటివ్స్‌‌‌‌‌‌‌‌ ఇస్తున్నారు. సూర్యాపేట పట్టణంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి తుంగతుర్తి, మద్దిరాల, నాగారం, జాజిరెడ్డిగూడెం, నూతనకల్, సూర్యాపేట, పెన్‌‌‌‌‌‌‌‌పహాడ్‌‌‌‌‌‌‌‌ మండలాల నుంచి గర్భిణులు వస్తుంటారు. ఈ సెంటర్‌‌‌‌‌‌‌‌లో నెలకు 300 వరకు నార్మల్‌‌‌‌‌‌‌‌ డెలివరీలు చేయాలని టార్గెట్‌‌‌‌‌‌‌‌ పెట్టారు. అలాగే కోదాడ, హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌లో నెలకు 50 చొప్పున నార్మల్‌‌‌‌‌‌‌‌ డెలివరీలు చేయాలని చెప్పారు. 

తుంగతుర్తి హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో గైనకాలజిస్ట్‌‌‌‌‌‌‌‌ లేకపోవడంతో అక్కడ డెలివరీలు చేయడం లేదు. టార్గెట్‌‌‌‌‌‌‌‌ను అధిగమిస్తే ప్రతి నార్మల్‌‌‌‌‌‌‌‌ డెలివరీకి రూ. 3 వేల చొప్పున ఇన్సెంటివ్‌‌‌‌‌‌‌‌ ఇస్తున్నారు. ఇందులో డాక్టర్‌‌‌‌‌‌‌‌, స్టాఫ్ నర్సుకు రూ. 1000 చొప్పున, పారిశుధ్య సిబ్బందికి రూ. 500, ఏఎన్‌‌‌‌‌‌‌‌ఎంకు రూ. 250, ఆశ వర్కర్‌‌‌‌‌‌‌‌కు రూ. 250 చొప్పున ఇస్తారు. దీంతో మరీ తప్పనిసరి అయితే తప్ప డాక్టర్లు సిజేరియన్‌‌‌‌‌‌‌‌ చేయడం లేదు.

నొప్పులు వచ్చేందుకు ఇంజక్షన్లు

డెలివరీ కోసం మాత శిశు కేంద్రాలకు వస్తున్న గర్భిణులను డాక్టర్లు ఇంకా టైం ఉందంటూ వెనక్కి పంపుతున్నారు. 9 నెలలు నిండినా కొందరికి నొప్పులు రాకపోవడంతో డాక్టర్లు వారికి ఇంజక్షన్లు ఇస్తున్నారు. దీంతో కడుపులో ఉమ్మ నీరు తగ్గిపోవడం, బీపీ లెవెల్స్ పెరుగుతుండడంతో శిశువులు పురిట్లోనే చనిపోతున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ఓ గర్భిణికి అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 13న సూర్యాపేటలోని ప్రభుత్వ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో చేరింది. డాక్టర్లు ఆపరేషన్‌‌‌‌‌‌‌‌ చేయకుండా పెయిన్స్‌‌‌‌‌‌‌‌ వచ్చేందుకు ఇంజక్షన్‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు. తర్వాత గర్భిణి బీపీ లెవెల్స్‌‌‌‌‌‌‌‌ పెరిగిపోవడంతో శిశువు చనిపోయింది.

 బీపీ వల్లే  శిశువుల మృతి

మాత శిశు కేంద్రంలో శిశువుల మృతికి డాక్టర్ల నిర్లక్ష్యం ఏమీ లేదు. కొంతమంది గర్భిణులకు బీపీ లెవెల్స్ ఎక్కువగా ఉండడం, ఉమ్మ నీరు తక్కువగా ఉండడంతో శిశువులు చనిపోతున్నారు. మాతా శిశు కేంద్రంలో క్వాలిఫైడ్ డాక్టర్ల పర్యవేక్షణలో మహిళలకు ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఇస్తున్నారు. - మురళీధర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, సూపరింటెండెంట్, సూర్యాపేట హాస్పిటల్‌‌‌‌‌‌‌‌