హైదరాబాద్‌లో టీ పౌడర్ కల్తీ.. స్పాట్‌లో 200కిలోల కొబ్బరి చిప్పల పొడి

హైదరాబాద్‌లో టీ పౌడర్ కల్తీ.. స్పాట్‌లో 200కిలోల కొబ్బరి చిప్పల పొడి

హైదరాబాద్ సిటీలో టీ పౌడర్ ను కల్తీ చేసి అమ్ముతున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు బయటపెట్టారు. సిటీలో పెద్ద పెద్ద హోటల్స్ నుంచి, చిన్న టీస్టాల్స్ వరకు అందరికీ వీరే టీ పౌడర్ సరఫరా చేస్తున్నారు. కానీ అది కల్తీ చేసింది. హైదరాబాద్ ఫతేనగర్‌లోని కోణార్క్ టీ తయారీ కేంద్రంపై అక్టోబర్ 9న టాస్క్ ఫోర్స్ టీంలు రైడ్స్ చేశారు. టీ పొడి కల్తీ చేసి హైదరాబాద్‌లోని వివిధ టీ స్టాల్స్‌కు పంపుతున్నట్లు వారు గుర్తించారు. టీ పౌడర్ లో హానికరమైన పదార్థాలను కలుపి దుండగులు సొమ్ముచేసుకుంటున్నారు. లూజ్ టీ పౌడర్‌లో విపరీతమైన కల్తీ జరిగినట్లు తనిఖీలో వెల్లడైంది. 

ALSO READ | సమోసాలు తినుడు బంద్ చేయండి : లేకుంటే మీ ప్రాణాల మీదకే !

కోనార్క్ టీ ప్రాంతంలో పెద్దఎత్తున కల్తీ పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 300 కిలోల లూస్ టీ పొడి, 200 కిలోల కొబ్బరి చిప్పల పొడి, నాన్-ఫుడ్-గ్రేడ్ ఎరుపు మరియు నారింజ రంగులు చెరో 5 కిలోలు, చాక్లెట్, ఏలకులు మరియు పాలు వంటి ఆర్టిఫీషియల్ ప్లేవర్లు స్వాధీనం చేసుకున్నారు. కల్తీ పదార్థాల శాంపిల్స్ సేకరించి లాబ్స్ కు పంపారు. ఆహార భద్రత మరియు ప్రమాణాల (FSS) చట్టం 2006 ప్రకారం పలు సెక్షన్లు మోపి కేసులు పెట్టారు. హైదరాబాద్‌లోని టీ వినియోగదారుల భద్రత మరియు శ్రేయస్సు కోసం సెంట్రల్ జోన్ పోలీస్ టాస్క్ ఫోర్స్ అందించిన సమాచారంతో ఈ దాడి జరిగింది.