భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : హోం వర్క్ చేయకపోవడంతో ఓ స్టూడెంట్‌ను టీచర్ వాతలు పడేలా కొట్టాడు. కొత్తగూడెం పట్టణంలోని గణేశ్ టెంపుల్ ఏరియాకు చెందిన చైతన్య స్థానిక మానస వికాస్ ప్రైవేట్ స్కూల్‌లో ఆరో తరగతి చదువుతున్నాడు. దసరా సెలవులకు ముందు మ్యాథ్స్ టీచర్ సతీశ్ హోంవర్క్ ఇచ్చాడు. మంగళవారం స్కూల్‌కు వచ్చిన చైతన్య హోం వర్క్ చేయకపోవడంతో ఆగ్రహానికి గురైన టీచర్ సతీశ్ స్టూడెంట్‌ను ఇష్టం వచ్చినట్లు కొట్టాడు.
ఇంటికి వెళ్లిన చైతన్య శరీరంపై వాతలు ఉండడాన్ని తల్లిదండ్రులు గమనించి బుధవారం ఉదయం స్కూల్‌కు వెళ్లి యాజమాన్యాన్ని నిలదీశారు. టీచర్ కొట్టలేదని చెప్పడంతో సీసీ ఫుటేజీని పరిశీలించగా టీచర్ కొట్టినట్లు తేలింది. విషయం తెలుసుకున్న పోలీసులు స్కూల్ వద్దకు చేరుకొని టీచర్‌ను అదుపులోకి తీసుకున్నారు.