కొన్ని చిత్రాలు కామెడీతో నవ్విస్తాయి..కొన్ని ఎమోషన్స్ తో బాధిస్తాయి. కొన్ని ఆలోచింపజేస్తాయి..మరికొన్ని హార్రర్ తో భయపట్టేస్తాయి. ఇదంతా ఇపుడు ఎందుకు అంటే..లేటెస్ట్ గా రిలీజైన పిండం అనే మూవీ రాబోతుంది. ఈ మూవీ స్టార్ట్ చేసినప్పటి నుంచి..మేకర్స్ చెప్పే ఒకే మాట..ఎప్పుడూ లేనంత భయపెట్టే..సినిమా ఇదంటూ మేకర్స్ చెబుతూ వస్తున్నారు.
లేటెస్ట్ గా ఆ తరుణం వచ్చేసింది. పిండం మూవీ టీజర్ సోమవారం (అక్టోబర్ 30) రిలీజ్ చేశారు. ముందుగా మేకర్స్ చెప్పినట్లే కాస్త భయపెట్టడానికి ప్రయత్నించారు. ఈ మూవీలో ఒకరికి ఒకరు ఫేమ్ శ్రీరామ్(Sriram), ఖుషీ రవి, ఈశ్వరి రావు(Eeswari Rao), అవసరాల శ్రీనివాస్(Avasarala Srinivas) నటించిన ఈ సినిమా.. ఆత్మల చుట్టూ తిరుగుతూ..ఆద్యంతం ఉత్కంఠతో కూడిన టీజర్ను కట్ చేశారు మేకర్స్
Also Read :- పెళ్లి కోసం అమ్మ సెంటిమెంట్
పిండం టీజర్ ఇంటెన్స్ గా సాగుతూ..ఆసక్తి కలిగిస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్తో టీజర్ భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ మూవీలో ఆత్మలను బంధించే మంత్రగత్తె పాత్రలో సీనియర్ నటి ఈశ్వరి రావు కీలక పాత్ర పోషించారు. హీరో శ్రీరామ్ తన ఫ్యామిలీని ఆత్మల నుంచి రక్షించుకునే పాత్రలో కనిపించిన తీరు ఆకట్టుకుంటోంది.
ఇందులో ఈశ్వరి రావు మాట్లాడే తీరు ఇంటెన్స్ యాంగిల్లో ఉంది. తన జీవితంలో చూసిన అత్యంత భయంకరమైన..కొన్ని ఆత్మల గురించి ఈశ్వరి రావు చెప్పే విధానం ఆసక్తి కలిగిస్తోంది. పిండం మూవీని రియల్ ఇన్సిడెంట్స్ ను బేస్ చేసుకుని తెరకెక్కించినట్లుగా మేకర్స్ పోస్టర్ లో తెలిపారు.
ఇక టీజర్ చివర్లో వచ్చే 'కళ్ళకు కనిపించే భౌతిక ప్రపంచం చాలా చిన్నది..దాని సరిహద్దులు మనకు అర్ధం ఔతాయి..కానీ లోపల ప్రపంచం సరిహద్దులు మనకు అర్ధం కావు..అంటూ ఈశ్వరీ రావు డైలాగ్ తో పిండం సినిమాపై అంచనాలు పెంచేశారు.అలాగే.. పిండం అనే టైటిల్ ఏంట్రా అని..అందరు అనుకుంటారు. ఇంతవరకు ఇదొక నెగెటివ్ పదమని మాత్రమే తెలుసు. కానీ, పిండం అంటే ఆరంభం..అంతం రెండూ ఉంటాయని.. డైరెక్టర్ సాయి కిరణ్ వెల్లడించారు
ఈ పిండం మూవీని సాయికిరణ్ డైరెక్ట్ చేస్తున్నారు. కాలాహి మీడియా బ్యానర్ పై యశ్వంత్ దగ్గుమాటి ప్రొడ్యూస్ చేస్తున్నాడు. నవంబర్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది.