హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ భేటీకి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల (సెప్టెంబర్) 20వ తేదీన మంత్రి మండలి సమావేశం కానుంది. సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు జరగనున్న ఈ భేటీలో.. పలు కీలక అంశాలపై చర్చించడంతో పాటు కొన్నింటికి కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.
Also Read :- ఆధార్ అప్డేట్కు ఇవాళే లాస్ట్ డేట్
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రాకి చట్ట బద్దత, ధరణి స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన భూమాత పోర్టల్‌పై కేబినెట్ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మూసీ ప్రక్షాళన వేగవంతం, నిధుల కేటాయింపుతో పాటు రాష్ట్రంలో వరద నష్టం, జిల్లాల వారీగా ఎన్ని నిధులు ఇవ్వాలనే అంశంపై డిస్కస్ చేసే ఛాన్స్ ఉంది. దీంతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికలు, కులగణనపై ఇటీవల రాష్ట్ర హైకోర్టు వెలువరించిన తీర్పుపై మంత్రి మండలి చర్చించనున్నట్లు తెలుస్తోంది.