పదవ తరగతి పరీక్షలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. గతంలో ఆరు సబ్జెక్టులకు 11 పేపర్లుండగా… కరోనాతో వాటిని ఆరు పేపర్లకు కుదించింది. 80 మార్కులకు ఎగ్జామ్..20 మార్కులకు ఇంటర్నల్స్ ఉండనున్నాయి. ఇప్పటికే కరోనా కారణంగా సెలబస్ ను 70 శాతానికి తగ్గించిన సర్కార్.. తాజాగా పేపర్లను కూడా కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. అవసరమైతే పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఎగ్జామ్స్ నిర్వహించాలనే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. మే 17 నుంచి 26 వరకు పరీక్షలు జరుగనున్న నేపధ్యంలో పిల్లలకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తోంది.
see more news