రాష్ట్రంలోని తొమ్మిది విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ లను నియమిస్తూ తెలంగాణ గవర్నర్ జిష్ణ దేవ్ వర్మ ఉత్తర్వులు జారీ చేశారు. పాలమూరు యూనివర్సిటీకి ప్రొఫెసర్ జి.ఎన్. శ్రీనివాస్ ని నియమించారు. కాకతీయ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి, ఓయూ వీసీగా ప్రొఫెసర్ కుమార్ మొగ్లారామ్, శాతవాహన యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ ఉమేష్ కుమార్, తెలుగు విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా నిత్యానందరావును నియామకం అయ్యారు.
మహాత్మా గాంధీ యూనివర్సిటీకి వీసీగా ప్రొఫెసర్ అల్తాఫ్ హుస్సేన్, తెలంగాణ యూనివర్సిటీ వీసీగా ప్రొ.యాదగిరిరావు, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ప్రొఫెసర్ అల్దాస్ జానయ్యను పేర్లను ప్రకటించారు. ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గా ప్రొఫెసర్ రాజి రెడ్డి నియామకం అయ్యారు.
ALSO READ | సుప్రీంకోర్టును ఆశ్రయించిన గ్రూప్ 1 అభ్యర్థులు