మున్సిపల్ చట్టంలో సవరణలు చేసిన తెలంగాణ ప్రభుత్వం

మున్సిపల్ చట్టంలో సవరణలు చేసిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీ చట్టం 1955 మరియు తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019 చట్టాలకు సంబంధించి పలు సవరణలు చేసింది. రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు- తిమ్మాపూర్ గ్రామ పంచాయతీలను విలీనం చేసిన కొత్తూరు మున్సిపాలిటీ‌గా ఏర్పాటుకు ప్రతిపాదించింది. అదేవిధంగా జీహెచ్ఎంసీ పరిధిలోని రామచంద్రాపుర్ పట్టణం నుంచి 9 కిలోమీటర్లు దూరంలో ఉన్న మన్మోల్ గ్రామంలోని కొన్ని సర్వే నంబర్లను సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీలో చేర్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పది గ్రామాలు మినహాయించి మిగతా వాటన్నింటిని కలుపుతూ గ్రామ పంచాయతీగా కొనసాగించేలా ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. అంతేకాకుండా.. ధరణి పోర్టల్ ద్వారా వెంటనే మ్యుటేషన్ ధ్రువపత్రం జారీ చేసే అధికారం ప్రభుత్వానికి కల్పిస్తూ చట్ట సవరణ చేసింది. అయితే ఎటువంటి రిజిస్ట్రేషన్ అయినా.. నీటి చార్జీలు, విద్యుత్ బకాయిల వంటివి చెల్లిస్తేనే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

For More News..

ఆక్స్‌‌ఫర్డ్ ట్రయల్స్‌కు బ్రేక్.. వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తికి అంతుచిక్కని సమస్యలు

రైతుకు ‘కరెంట్’ షాక్.. రెండు నెలలకు రూ. 3.71 కోట్ల కరెంట్ బిల్లు

లంచానికి అగ్రిమెంట్ చేయించుకున్న అడిషనల్ కలెక్టర్.. ఎన్వోసీకి కోటి 12 లక్షలు డిమాండ్