హుస్సేన్ సాగర్ లో మట్టి వినాయకులు మాత్రమే నిమజ్జనం : హైకోర్టు సంచలన తీర్పు

హైదరాబాద్ : గణేష్ విగ్రహాల నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. హుస్సేన్ సాగర్, చెరువుల్లో పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేవలం మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే నిమజ్జనం చేయాలని తెలిపింది. పీవోపీ విగ్రహాలను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన కుంటల్లో నిమజ్జనం చేయాలని తెలిపింది. హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని సీపీ, జీహెచ్ఎంసీ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం.