బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్నకు హైకోర్టు నోటీసులు

ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్నతో పాటు జిల్లా అధికారులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. భూమి పూజ విషయంలో ఎమ్మెల్యేతో పాటు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, మావల తహశీల్దార్, రెవెన్యూ అధికారులకు నోటీసులు జారీ చేసింది.

తనకు సంబంధించిన భూమిలో ఎస్సీ కమ్యూనిటీ హాలు నిర్మాణం కోసం ఎమ్మెల్యే జోగు రామన్న ఇటీవల భూమి పూజ చేశారని గంగుబాయి అనే మహిళ హైకోర్టును ఆశ్రయించింది. మే 29వ తేదీన భట్టి సవర్గాం శివారులో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ఎమ్మెల్యే భూమి పూజ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఆ భూమి తనదేనని గంగుబాయి..హైకోర్టును ఆశ్రయించడంతో ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్, మావల తహశీల్దార్..  మొత్తం ఆరుగురు అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.