అట్టహాసంగా తెలంగాణ సబ్ జూనియర్ అథ్లెటిక్స్​ పోటీలు

అట్టహాసంగా తెలంగాణ సబ్ జూనియర్ అథ్లెటిక్స్​ పోటీలు

మంచిర్యాల, వెలుగు: తెలంగాణ స్టేట్​సబ్​ జూనియర్​అథ్లెటిక్స్​చాంపియన్​షిప్​పోటీలు ఆదివారం మంచిర్యాలలో అట్టహాసంగా షురూ అయ్యాయి. డీసీసీ చైర్​పర్సన్​కొక్కిరాల సురేఖ చీఫ్ గెస్ట్‎గా హాజరై  ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్‎కు​ప్రాధాన్యం ఇస్తోందన్నారు. క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు యంగ్​ఇండియా స్పోర్ట్స్​యూనివర్సిటీని ఏర్పాటు చేసిందన్నారు. జిల్లాలోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సాయికుంటలో రూ.19 కోట్లతో 11 ఎకరాల్లో ఇండోర్, అవుట్​ డోర్​స్టేడియం మంజూరు చేసిందని తెలిపారు. 

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. మంచిర్యాల జిల్లా అథ్లెటిక్స్​అసోసియేషన్​ఆధ్వర్యంలో ఉషోదయ హైస్కూల్‎లో వివిధ జిల్లాల నుంచి 800 మందికిపైగా విద్యార్థులు తరలివచ్చి పోటీల్లో పాల్గొన్నారు. ఆయా విభాగాల్లో చిన్నారులు సత్తా చాటారు. తెలంగాణ అథ్లెటిక్స్​అసోసియేషన్​ సెక్రటరీ కె.సారంగపాణి,  జిల్లా ప్రెసిడెంట్​ఎం.సాంబమూర్తి, చైర్మన్​ కె.సంపత్​రెడ్డి, సెక్రటరీ ఈ.మారయ్య పాల్గొన్నారు.