
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో ఆదివారం ఎండ దంచి కొట్టింది. జిల్లాలో అత్యధికంగా నస్రుల్లాబాద్‌లో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దోమకొండ, రామారెడ్డిల్లో 44.2 డిగ్రీలు, వెల్పుగొండలో 44, భిక్కనూరు, కొల్లూర్‌లో 43.9, తాడ్వాయి, పాతరాజంపేట, హాసన్పల్లిల్లో 43.8, సర్వాపూర్‌లో 43.6, సదాశివనగర్‌లో 43.5, ఆర్గొండలో 42.8,బిచ్కుందలో 42.6, గాంధారి, లచ్చాపేటలో 42.3 ఉష్ణోగ్రత నమోదైంది.