
మెదక్, వెలుగు : మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ లోని మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్సియల్ స్కూల్/కాలేజీ (ఎంజేపీఆర్ఎస్సీ)లో నలుగురు స్టూడెంట్స్ టెన్త్ మెమోలు మిస్సయ్యాయి. బాధితుల కథనం ప్రకారం...సమీక్ష, కావేరి, జ్యోతి, సింధు అనే స్టూడెంట్స్ 2020 -–21వ సంవత్సరంలో ఈ స్కూల్లోనే 10వ తరగతి పూర్తి చేశారు. ఒకరు ఇదే కాలేజీలో..మరో ముగ్గురు వేరే చోట ఇంటర్ లో చేరారు.
ఎంసెట్ కౌన్సిలింగ్, ఆధార్అప్డేషన్, పై చదువులు, ఇతర సర్టిఫికెట్ల కోసం కోసం టెన్త్ మెమోలు అవసరమై మంగళవారం స్కూల్కు వెళ్లగా మెమోలు కనిపించడం లేదని సిబ్బంది సమాధానమిచ్చారు. దీంతో వారు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయమై ప్రిన్సిపాల్ రజిని వివరణ కోరగా మెమోలు కనబడకుండా పోయింది నిజమేనని, డూప్లికేట్ మెమోలు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్టూడెంట్స్ పై చదువులకు ఇబ్బంది కలుగకుండా చూస్తామన్నారు.