ఆరు నెలల్లో నౌకా దళంలో చేరునున్న ఐఎన్​ఎస్ అర్ధమాన్​

ఆరు నెలల్లో నౌకా దళంలో చేరునున్న ఐఎన్​ఎస్ అర్ధమాన్​

ఐఎన్​ఎస్​ అరిఘాత్​ను జాతికి సమర్పించిన వేళ.. మూడో అణు జలాంతర్గామి ఐఎన్​ఎస్​ అర్ధమాన్​ మరో ఆరు నెలల్లో నౌకా దళంలో చేరునున్నది.

ఐఎన్​ఎస్​ అర్ధమాన్​ 125 మీటర్ల పొడవు, 7000 టన్నుల డిస్పేస్మెంట్​ బరువుతో తయారు చేస్తున్నారు. వీటిల్లో గతంలో నిర్మించిన రెండు సబ్​మెరైన్​ల కంటే కే–4 క్షిపణులను ఎక్కువగా తీసుకెళ్లవచ్చు. 1990లో రహస్యంగా ప్రారంభించిన అడ్వాన్స్డ్​ టెక్నాలజీ వెస్సల్​ ప్రాజెక్టులో భాగంగా జలాంతర్గాములను నిర్మించారు. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.90,000కోట్లు. 

వాస్తవానికి అమెరికా, రష్యా, చైనా జలాంతర్గాముల కంటే ఇవి చిన్నవి. చైనా వినియోగించే ఆరు జిన్​ శ్రేణి జలాంతర్గాములు జేఎల్​–3 క్షిపణులను అమర్చారు. ఇవి 10 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు.