నిట్‌‌లో ముగిసిన టెక్నోజియాన్‌‌

నిట్‌‌లో ముగిసిన టెక్నోజియాన్‌‌

కాజీపేట, వెలుగు : వరంగల్ నిట్‌‌లో మూడు రోజుల పాటు జరిగిన టెక్నోజియాన్‌‌ 2024 ఆదివారంతో ముగిసింది. శుక్ర, శని, ఆదివారాల్లో వివిధ అంశాలకు సంబంధించిన 58 ఈవెంట్లను ప్రదర్శించారు. ఆదివారం రోజున ఎలక్ర్టికల్‌‌, ఎలక్ట్రానిక్స్‌‌ సొసైటీ ఆధ్వర్యంలో వోల్టేజ్‌‌ వోర్టెక్స్, మేనేజ్‌‌మెంట్‌‌ స్టూడెంట్లతో ప్రొడక్ట్‌‌ లాంచ్, ఎలక్ట్రానిక్‌‌ అమెచ్యూర్స్, లాబ్రింత్‌‌ ఈవెంట్స్‌‌ జరిగాయి.

మెకానికల్‌‌ ఇంజినీరింగ్‌‌ సొసైటీ ఆధ్వర్యంలో మెకానికల్‌‌ కిట్‌‌ అసెంబ్లీ, ఆస్ట్రానమీ క్లబ్, వండర్‌‌ కాస్మోస్, బయోటెక్ సొసైటీ సెల్యూషన్స్‌‌ ఈవెంట్‌‌, కంప్యూటర్‌‌ గేమ్స్‌‌కు సంబందించి ఈ– గేమ్స్‌‌ స్పాట్‌‌లైట్‌‌ ఈవెంట్స్‌‌ జరిగాయి. ‘స్పాట్‌‌ లైట్‌‌’ ఈవెంట్‌‌లో భాగంగా స్టూడెంట్లు లేజర్‌‌ అలారం షోను ప్రదర్శించారు.