
వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో త్రిరాత్రి ఉత్సవాలు సోమవారం రాత్రి ఘనంగా ముగిశాయి. శివ కళ్యాణ మహోత్సవానికి ముందు మూడు రోజులపాటు త్రిరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. చివరి రోజు శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామికి ఆలయ
స్థానచార్యులు అప్పాల భీమాశంకర్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అద్దాల మండపంలో ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలకరించి డోలోత్సవం నిర్వహించారు.