సీఎం కేజ్రీవాల్ రాజీనామాకు ముహూర్తం ఫిక్స్.. ఢిల్లీ పాలిటిక్స్‎లో నరాలు తెగే ఉత్కంఠ

సీఎం కేజ్రీవాల్ రాజీనామాకు ముహూర్తం ఫిక్స్.. ఢిల్లీ పాలిటిక్స్‎లో నరాలు తెగే ఉత్కంఠ

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పొలిటికల్ ఈక్వేషన్స్ శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఆప్ జాతీయ కన్వీనర్, సీఎం కేజ్రీవాల్ ప్రకటించడంతో ఢిల్లీ పాలిటిక్స్ దేశంలో హాట్ టాపిక్‎గా మారాయి. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేసేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. రేపు (సెప్టెంబర్ 17) ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌ను కలిసేందుకు కేజ్రీవాల్ అపాయింట్మెంట్ తీసుకున్నట్లు ఆప్ వర్గాలు వెల్లడించాయి. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు ఎల్జీతో భేటీ కానున్న కేజ్రీవాల్.. ఈ సందర్భంగా రిజైన్ లైటర్ ఆయనకు అందించనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఒకరు తెలిపారు.

కాగా, కేజ్రీవాల్ రిజైన్ ప్రకటన నేపథ్యంలో ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ ఇవాళ (సెప్టెంబర్ 16)న అత్యవసరంగా భేటీ అయ్యింది. ఆప్ కీలక నేతలు, మంత్రులు హాజరైన ఈ కీలక సమావేశంలో కొత్త సీఎం ఎంపిక, కేబినెట్ కూర్పుపై చర్చించినట్లు టాక్. మరోవైపు రేపు ఉదయం 11 గంటలకు శాసన సభా పక్ష సమావేశానికి ఆప్ పిలుపునిచ్చింది. ఈ మీటింగ్‎లో నూతన సీఎం ఎంపికకు ఆప్ ఎల్పీ ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం సాయంత్రం 4.30 గంటలకు లెఫ్టినెంట్ గవర్నర్‎తో భేటీ అయ్యి కేజ్రీవాల్ తన సీఎం పదవికి రాజీనామా లేఖ సమర్పించినట్లు తెలిసింది.

ALSO READ | రెండ్రోజుల్లో రిజైన్​ చేస్త ... ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్​ ప్రకటన

 కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్‎లో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ ఇటీవల బెయిల్‎పై బయటికి వచ్చిన విషయం తెలిసిందే. లిక్కర్ స్కామ్ తీవ్ర ఆరోపణలు రావడంతో సీఎం పదవికి రాజీనామా చేయాలని ఆయన డిసైడ్ అయ్యారు. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి పదవికి గుడ్ బై చెబుతానని. మళ్లీ ఎన్నికలకు వెళ్లి.. ప్రజాక్షేత్రంలో తన నిజాయితీని ప్రూవ్ చేసుకున్న తర్వాతే మళ్లీ సీఎం పదవి చేపడతానని.. అప్పటి వరకు ముఖ్యమంత్రి పదవికి దూరంగా ఉంటానని కేజ్రీవాల్ శపథం చేశారు. కేజ్రీవాల్ రాజీనామా చేయనున్న నేపథ్యంలో.. కౌన్ బనేగా నెక్ట్స్ ఢిల్లీ సీఎం అనేది జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.