సంగారెడ్డి జిల్లా: సంతోషంగా పెళ్లికి వెళ్తున్న వారు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైయ్యారు. అప్పటివరకూ ఆనందంగా గడిపిన కుటుంబాలను ఒక్కసారిగా విషాదఛాయలు కమ్మేశాయి. ఆందోల్ మండలం మాన్సాన్ పల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివాహ శుభకార్యానికి వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలలు అక్కడికక్కడే చనిపోయారు. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. పోలీసులు ప్రమాద స్థాలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ప్రమాదానికి గల కారణం తెలియాల్సిఉంది.