మంచు మనోజ్ కారు బ్లాక్ ఫిల్మ్ తొలగించిన పోలీసులు

హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసులు రూల్స్ ను కఠినతరం చేస్తున్నారు. కార్లకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ లను తొలగించి ఫైన్ వేస్తున్నారు. లేటెస్ట్ గా టోలిచౌకీలో మంచు మనోజ్ కారుకు ఫైన్ వేశారు ట్రాఫిక్ పోలీసులు.  టోలిచౌకిలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీ చేస్తుండగా మంచు మనోజ్ కారును ఆపారు. అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలింను తొలగించి చలాన్ రూ.700 విధించారు.   ఇటీవల అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్ ల కార్లకు బ్లాక్ ఫిల్మ్  తొలగించి ఫైన్ వేశారు ట్రాఫిక్ పోలీసులు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. 

మరిన్ని వార్తల కోసం..

పెట్రోల్ రేటు మళ్లీ పెరిగింది

జైల్లో చదివిండు.. ఐఐటీ ర్యాంకర్​​ అయ్యిండు

ఈ ఆటో డ్రైవర్.. ఒకప్పుడు ఇంగ్లీష్​ టీచర్