ట్రైన్ జర్నీ అంటే ఇష్టపడని వారెంవరుంటారు చెప్పండి.. నదులు, కొండలు, కోనలు, పంట చేనుల మధ్య ప్రకృతి అందాలు ఆస్వాదిస్తూ ట్రైన్ జర్నీ చేయడమంటే చాలామందికి ఇష్టం. గజిబిజి ట్రాఫిక్ గందర గోళం, హారన్ సౌండ్లు లేకుండా హాయిగా సాగే రైలు ప్రయాణం ఎంజాయ్ చేయని వారుండరు. ఇక మధ్యమధ్యలో వచ్చే స్టేషన్లలో నిలబడాల్సిన ప్లాట్‌ఫాం ఖాళీగాలేకుంటే పట్టాలపై ఉంటే ట్రాక్‌ల ద్వారా పక్క ప్లాట్‌ఫాంకి చేరుస్తుంది. ఐతే ఈ తతంగాన్ని ఎప్పుడైనా చూశారా? ఇందులో చూడటానికి ఏముంది.. ట్రాక్ మీద కాస్త వంక తిరిగి పక్క ప్లాట్‌ఫాం మీదకు వెళ్తుంది అంతేకదా అని అనుకుంటున్నారా? ఐతే మీరు వార్త చదవాల్సిందే..
మిలియన్ల వ్యూస్
పట్టాల మీద రైలు ఒకటి కాదు రెండు కాదు అనేక ట్రాక్‌లను తప్పించుకుంటూ పాములాగా వంకర్లు పోతూ వెళుతోన్న రైలు వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చూసేందుకు కాసేపు ఇది రైలా, పామా అనే సందేహం కూడా కలుగుతుంది. ఇదెక్కడో విదేశాల్లో అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అక్షరాలా మన దేశంలోని ట్రైనే ఇది. మహారాష్ట్రలోని పూర్ణ జంక్షన్‌లో ఓ ట్రైన్ స్టేషన్‌కు చేరుకునే క్రమంలో తీసిన వీడియో ఇది. ఈవీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన గంటల వ్యవధిలోనే మిలియన్ల కొద్దీ వ్యూస్, లక్షల్లో లైకులు, కామెంట్లు రావడంతో ఇది కాస్తా పోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఏది ఏమైనా.. మన ఇంజనీర్ల బుర్ర చాలా షార్ప్.. ఇలాంటి ట్రాక్‌లను వేయడంలో ఇండియన్స్‌ది అందె వేసిన చెయ్యి అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్ సెక్షన్‌లో పేర్కొన్నారు.
పాములా మారిన రైలు!
మహారాష్ట్రలోని పూర్ణా జంక్షన్‌లో వైరల్‌గా మారిన వీడియో. స్టేషన్‌లో చాలా ట్రాక్‌లు వంకరగా పడి ఉన్నాయి. రైలు దాని మీదుగా వెళ్ళగానే, అది కూడా అదే రూపంలో నడుస్తుంది. రైలును చూస్తే పాములా అనిపిస్తుంది. రైలు ఊగుతున్న కదలిక పాములా తయారవుతోంది. పాములకు కాళ్లు ఉండవు, కాబట్టి అవి వృత్తాలుగా నడుస్తూ ముందుకు సాగుతాయి. ఈ రైలు కూడా అదే స్పైరల్ స్పీడ్‌తో కదులుతోంది. రైలు పట్టాలు కొన్ని విచిత్రంగా ఉంటే రైలు వెళ్తున్నప్పుడు ఆ దృశ్యాలు మనల్ని ఆకట్టుకుంటాయి. తాజాగా, రైలు పట్టాలపై ఓ రైలు పాములా వెళ్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని పర్బనీ జిల్లాలో పూర్ణ జంక్షన్ ప్రధాన రైల్వే స్టేషన్. ఇక్కడ రైలు పట్టాలు వంపులా పాములా ఉండడంతో రైలు వెళ్తున్నప్పుడు పాము వెళ్తుందా, లేక రైలు వెళ్తుందా అన్నట్లు ఉంటుంది. ఇది నిజంగా పాములానే ఉంది అంటూ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.ఈ వీడియోను కోటి కంటే ఎక్కువ మంది వీక్షించారు. చాలా మంది కామెంట్ కూడా చేశారు. లోకో పైలట్ రైలును పాములా మార్చాడని ఒకరు అన్నారు. ఈ రైలులో అందరి మాజీ గర్ల్‌ఫ్రెండ్స్ వెళ్తున్నారని ఒకరు చెప్పారు. ఓ వ్యక్తి రైలుకు నాగిన్ ఎక్స్‌ప్రెస్ అని పేరు పెట్టగా, రైలును పాములా మార్చేందుకు డ్రైవర్ సీరియస్‌గా తీసుకున్నాడని మరొకరు చెప్పారు!